పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

119 గతియిది శ్రీపతి కైంకర్యంబు చ. పాలసముద్రము బలిమిఁ దచ్చికొని రాలరిదేవత లమృతమును నాలుక నిదె హరినామపుటమృతము యేల కానరో యిహపరసుఖము చ. అడరి బాఁతిపడి యవని దేవతలు బడివాయరు యజ్ఞభాగాలకు విడువక చేతిలో విష్ణుప్రసాదము కడిగడియెనది కానరు గాని చ. యొక్కుదురు దిగుదు రేడులోకములు పక్కనఁ దపముల బడలుచును చిక్కినాఁడు మతి శ్రీవేంకటేశ్వరుఁ - డిక్కడి తుదిపద మెఱఁగరు గాని రేకు:0107-05 బౌళి సంపుటము:02-041 పల్లవి: అతిసులభం బిదే శ్రీపతిశరణము అందుకు నారదాదుల సాక్షి ప్రతిలే దిదియే నిత్యానందము బహువేదంబులె యివే సాక్షి చ. వేసరకుమీ జీవుఁడా వెదకివెదకి దైవమును ఆసపాటుగా హరి యున్నాఁడిదె అందుకుఁ బ్రహ్లాదుఁడే సాక్షి మోసపోకుమీ జన్మమా ముంచిన యనుమానములను సేసినభక్తికిఁ జేటు లేదు యీసేఁతకెల్ల ధ్రువుఁడే సాక్షి చ. తమకించకుమీ దేహమా తగుసుఖదుఃఖంబుల నలసి అమితము నరహరికరుణ నమ్మితే నందుకు నరునుఁడే సాక్షి భ్రమయకుమీ వివేకమా బహుకాలంబులు యీ(దీఁది తమితో దాస్యము తను రక్షించును దానికి బలీంద్రుఁడే సాక్షి చ. మరిగివుండుమీ వోజిహ్వా మరి శ్రీవేంకటపతినుతులు అరయఁగ నిదియే యీడేరించును అందుకు వ్యాసాదులే సాక్షి తిరుగకుమీ విజ్ఞానమా ద్రిష్టపుమాయలకును లోఁగి సరిలే దితనిపాదసేవకును సనకాదుల బ్రదుకే సాక్షి పె.అ.రేకు:0017-03 బౌళి సంపుటము: 15-095 పల్లవి: అతిసులభుడవు నీ వవి నిన్నుఁ గొలిచి తతి మేలే కొందుఁ గాని తప్ప మాకులేదు చ. తిట్టే శిశుపాలనకు దివ్యపద మిచ్చితివి ముట్టి కొలుచువారికి మోక్షమియ్యవా వెట్టి బండి రొప్పించిన విజయునిఁ గాచితివి నెట్టిన నీ కింకరుల నీవు గావ కుందువా చ. తన్నినభృగువు నటు తగ సంతోషించితివి అన్నిటాఁ బూజించువారి నాదరించవా నిన్ను రోషిఁచు కాళింగు నెమ్మి గరుణించితివి వున్నతిఁ గొల్చినవారి నొగిఁ గరుణించవా చ. అమ్మమొనకుఁ జిక్కిన అంబుధి మొరాలించితి నమ్మినవారిమాట వినవా నీవు యిమ్ముల శ్రీవేంకటేశ యిఁక సరిలేదు నీకు పమ్మి శరణాగతులఁ బాలించకుందువా రేకు: 9035-02 బౌళిరామక్రియ సంపుటము: 04-555 పల్లవి: అదరీ బెదరీ నంతనంత