పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

109 రేకు:0098-01 సాళంగనాట సంపుటము: 01-489 పల్లవి: అట్టివేళఁ గలఁగనీ దదివో వివేకము మట్టుపడితే శాంతము మఱి యేలా చ. జడధులు వొంగినట్టు సందడించు నింద్రియములు వొడలిలో జీవునికి నొక్కొక్కవేళ బడబాగ్ని రేగినట్టు పైకొనీ ముంగోపము వుడికించు మనసెల్ల నొక్కొక్కవేళా చ. ఆరయ గొండయెత్తినట్టు వేఁగౌ సంసారము వూరక కలిమిలేము లొక్కొక్కవేళ మేరలేని చీకటియై మించును దుఃఖములెల్లా వూరట లేనికర్మికి నొక్కొక్కవేళా చ. పెనుగాలి వీచినట్టు పెక్కుకోరికెలు ముంచు వొనర నజ్ఞానికి నొక్కొక్కవేళ యెనయఁగ శ్రీవేంకటేశుదాసుడైనదాఁకా వునికిఁ బాయ విన్నియు నొక్కొక్కవేళా పె.అ.రేకు:0051-01 లలిత సంపుటము: 15-287 పల్లవి: అట్టె నీ సుకృతము ఆపన్నుని రక్షించితే చుట్టమవు నీవే కృపఁ జూడఁగదవయ్యా చ. వఱత మునిఁగేవాని దరి నుండేవాఁడు వెఱవక చే యిచ్చి వెళ్లఁదీసును మఱచి యజ్ఞానములో మగుచు నుండేటి నన్ను యెఱిఁగిన సర్వేశ్వర యెత్తి కావవయ్యా చ. చులుకఁగాని వానికి సుఖంమైన వైద్యుఁడు బలువైన మందిచ్చి బ్రదికించును కొలంఘైన పాపములఁ గుంగుచు నుండేటి నన్ను యిలధరనామామృత మిచ్చి కావవయ్యా చ. నిరుఁబేద యైనవాని నిండిన ధనవంతుఁడు ఆరసి లేములు మాన్పి యాదరించును సరి ననాథుఁడనై శరణు చొచ్చితి నిన్ను హరి శ్రీవేంకటేశ మే లందిచ్చి కావవయ్యా పె.అ.రేకు:0073-04 వరాళి సంపుటము: 15-420 పల్లవి: అట్టే పెంచితేఁ బెరుగునడఁచితే నడఁగును దిట్టలై వివేకులాల తెలుసుకోరో చ. తగలకుండఁగవలె తలఁచితేఁ గామాదులు పొలుచు నిప్పుల నేయి పోసినటూ కలఁగకుండఁగవలె కలఁగితేను మనసు చెలఁగి చీమలపుట్ట చిమ్మి రేఁగిన టుండు చ. యెడ మియ్యకుండవలె యెడమిచ్చితేఁ గోపము విడివడ్డకోఁతికి వెట్టెత్తినట్లు వొడిగట్టకుండవలె వొడిగట్టితే నాసలు కడళ్లతో సముద్రము కడతేరనట్టు చ. తగలకుండఁగవలె తగిలితే భోగములు జిగురుగండెఁ బక్షులు చిక్కినట్లు తగు శ్రీవేంకటేశ్వరు దాసు లిందు భ్రమయరు జిగి మించే నమృతము చేతి కబ్బినట్లు