పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

108 పె.అ.రేకు: 0065-04 నారాయణగౌళ సంపుటము: 15-373 పల్లవి: అటువలెనే వుండవలదా హరిపై భక్తియును పటువై భాగవతుల భాగ్యఫలము గానా చ. పడిపోయిన యర్ధము పక్కనఁ గనినపుడు వడిఁ బ్రాయము మగుడఁగఁ దావచ్చినయపుడు బిడిసిన కార్యము పొందై చేకూరినయపుడు అడరిన సంతన మింతంతనవచ్చునే మతికి చ. అట్టే దేశాంతరగతుడగు సుతుఁ గని నపుడు నెట్టనఁ బొయ్యే ప్రాణము నిలిచినయపుడు దట్టమై మఱచిన పద్యము దలఁపయిన యపుడు వొట్టిన సంతస మెంతని వొనగూడును మతికి చ. అలిగిన యేలికె తనుఁగ గడు నాదరించినపుడు చెలఁగుచు దూరపు కాంతను చేరినయపుడు బలు శ్రీవేంకటగిరిపతి ప్రత్యక్ష మైనపుడు నెలకొని సంతస మెంతని నిండుకుండు మతికి రేకు:0189-05 పాడి సంపుటము:02-454 పల్లవి: అట్టయితే నాయంతర్యామివేలైతివయ్యా మట్టుమీఱి ముక్తియాస మాననటవయ్యా చ. పాలఁతులు లేరా భూమి భోగించే నే లేనా కలకాల మింద్రియాల కాణాచి లేవో తొలి యీ సంసారము లేదో నాకాంక్షలు లేవో యెలమి నిన్నుఁ గొలుచు టిందుకటవయ్యా చ. ధరలోఁ బసిఁడి లేదా తగిలి నాయాస లేదా సిరుల యజ్ఞానపుచీఁకటి లేదా అరయఁ జవులు లేవా అందుకో నాలికె లేదా యిరవై నిన్నుఁ గొలుచు టిందుకటవయ్యా చ. అట్టే సర్వాపరాధి నపరాధా లెంచనేల గట్టిరాళ్లలో మలిగండ్లేరనేల నెట్టన శ్రీవేంకటేశ నిన్నుఁ జూచి కావకుంటే ఇట్టే నిన్నుఁ గొలుచు టిందుకటవయ్యా పె.అ.రేకు:0002-02 సాళంగనాట సంపుటము: 15-009 పల్లవి: అట్టివాఁడఁ గనకనే హరి నీదాసుఁడ నైతి వొట్టిన యపరాధము లొడ్డించుకో వశమా చ. యెన్ని నేరాలైనఁ జేసి యేమిటాఁ ధీరని తప్ప వున్నతి నీ లెంక నైతే వూరకె పోవు పన్ని పగసేసి వచ్చి బలవంతుని మరుఁగు తన్ను దానే చొచ్చితేను దక్కిపోవుఁ బనులూ చ. వొడ్డిన సామ్మెల్లాఁ దిని వూనిన ఋణమునకు బిడ్డపేరు వెట్టితేను బీతి వాసును అడ్డమై జగడగాని ఆడరానిమాట లాడి ముడ్డిమీది కెత్తుకొని మొక్కితేనే పోవును చ. పాపమే కూడుగ నుండి పట్టి నారాయంటేను చేపట్టి వైకుంఠ మిచ్చి చేరి కాచితి యేపున శ్రీ వేంకటేశ యిదీ వినే పాశీ నేను మూఁపున నీ యచ్చు మోచి ముందర నిలిచితి