పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

107 పె.అ.రేకు:0046-01 శుద్దదేశి సంపుటము: 15-258 పల్లవి: అటుగానా యేమి సేసినా యధికుల దూషింపఁగ జనదు పటుగతి వారల మహాత్మ్యంబులు పరికింపఁగా ననంతములు చ. ధరలో దుర్వాసుఁడు గోపియైన తపమునకు భంగ మనఁ దగునా పరాశరుఁడు మత్స్యగంధిఁ గోరిన పాపమంటునా యాతనికి అరసి వాయుజుఁడు బ్రహ్మపట్టమున కాసగించితే లాఘవమా సరి జనకుఁడు రాజ్యఁబు చేసితే సద్దతిఁ బొందక తొలంగెనా చ. అనలుఁ డెప్పుడు సర్వభక్షకుఁడైతే నశుచిత్వము గలదా దినకరుకిరణము హేయము లంటిన దినదీప్తికి నిగడ మగునా వొనర చంద్రునకు కళంకు గలిగిన నుడుగక శైత్యము మానీనా ఘనుఁడగు శేషుఁడు విషధరుఁడైతే కడుఁ బాండిత్యము దరగీనా చ. అల ప్రపూదుడు రాక్షస జన్మంబైనంతనె భక్తికిఁ గొదువా కులముగల హరిశ్చంద్రుఁడంత్యజునిఁ గొలిచిన సత్యము కడ మగునా కలహప్రియుడైనా నారదునకుఁ గలిగిన సాత్వికమునఁ గొఱతా యెలమి శ్రీవేంకటేశుఁడు తనదాసుల యిండ్లనున్న నధికుఁడే కాఁడా రేకు:0097-02 లలిత సంపుటము: 01-484 పల్లవి: అటువంటివాఁడువో హరిదాసుఁడు అటమటాలు విడిచి నాతండే సుఖ చ. తిట్టేటిమాటలును దీవించేమాటలును అట్టే సరెని తలఁచి నాతఁడే సుఖ పట్టి చంపేవేళను పట్టము గట్టే వేళ అట్టు నిట్టు చలించనిల యాతడే సుఖ చ. చేరి పంచదారిడినఁ జేదు దెచ్చి పెట్టినాను అరగించి తనివొందే యతఁడే సుఖి తేరకాండ్లఁ జూచిన తెగరాని చుట్టముల నారయ సరిగాఁజూచే యాతడే సుఖ చ. పొంది పుణ్యము వచ్చి పారిఁ బాపము వచ్చిన నందలి ఫలమొల్లని యాతడే సుఖి విందుగా శ్రీవేంకటాద్రి విభునిదాసులఁ జేరి అందరానిపద మందననాతఁడే సుఖి పె.అ.రేకు:0074-02 శంకరా'రణం సంపుటము: 15-424 పల్లవి: అటువలెనె సుజ్ఞాని యన్ని పుణ్యములుఁ జేసి తటుకున హరి కిచ్చితా నుండవలెను చ. వూరి పసులను మేపి వొప్పగించి యిండ్లకు చేరి జంగిలివాఁడు నిశ్చింతుఁడై వుండు తేరకాఁడు మోసి మోచి తెచ్చి నగరి కొప్పించి నేరుపుతో వెట్టి వాఁడు నెమ్మది నిద్రించును చ. అంటి బూరెలు వండినయాపె చేతులట చూపి యింటివారి కొప్పగించి యేఁగినయట్టు నంటుతోడఁ బేరటాలు నాగవల్లియైనమీఁద వొంటిఁ దన నెలవున నూరకున్నయట్టు చ. కూటమి వచ్చినవాఁడు గుంపులెల్లా విచ్చిపోతే యేఁటివాఁడుఁ గాక తన యిచ్చనే వుండు పాటించి శ్రీవేంకటేశుబంటు యేలికెపనులు గాటాన నన్నిఁ జేయుఁ గర్త యేమీ గాఁడు