పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

106 రేకు:0112-05 గుండక్రియ సంపుటము:02-071 పల్లవి: అటుగన నే రోయఁగఁ దగవా నటనల శ్రీహరి నటమింతే చ. చిడుముడి మూఁగిన జీవులలోపల కడఁగి నే నొక్కఁడ నింతే విడువక పక్షులు వృక్షము లిలపై వెడఁగు భోగములు వెదకీనా చ. తనువుల మోచిన తగుప్రాణులలోఁ గనుఁగొన నొకమశకము నింతే మునుకొని కీటకములుఁ జీమలు నిల చెనకి దొరతనము సేసీనా చ. శ్రీవేంకటపతిసేవవారిలో సాశీవల నొకదాసుఁడ నేను భావించి సురలు బ్రహ్మాదు లతనిదైవపు మాయలు దాఁటేరా రేకు:0189-01 ధన్నాసి సంపుటము:02-450 పల్లవి: అటుగాన మోసపోక హరి నీకే అన్నియును ఘటియించుటే యొక్కుడు కమలారమణ చ. నిన్నుఁజూడని కన్నులు నీచువలకన్నులు చిన్ని నీకథవినని చెవులు రాట్నపుఁ జెవులు వున్నతి నీకడకు రాకున్న కాళ్లు మరగాళ్లు సన్నుతిసేయని జిహ్వ హరి నుపజిహ్వ చ. చేరి నిన్నుఁ బూజించని చేయి దంతెనపుఁజేయి తారి నీకు మొక్కనట్టి తలయే పెడతల సారె నీముద్రలేని భుజములు బుద్భుజములు తేరి నీదాస్యములేని దేహము సందేహము చ. వనమాలలున్న గ్రీవము కంబుగ్రీవము ఘన మిది దెలియుటే కైవల్యము యెనయ శ్రీవేంకటేశ ఇటు నన్ను నేలితివి అనుమానమెల్లఁ బాసె నన్నిటా నాకును పె.అ.రేకు:0076-01 కాంబోది సంపుటము: 15-435 పల్లవి: అటుగాన శరణంటి నపరాధము లెందుకు తటుకున బ్రదికించి దయఁ జూడవే చ. యెంచరాని నేరములు యిన్నిఁ జేసి యేలికకు వంచనతో మొక్కితే భావము గరఁగు పాంచి పొంచి వెగటుగాఁ బోరినవాఁడై నాను మంచిమాట లాడితే సమ్మతి హితుఁ డౌను చ. ఆనాజ్ఞ దోసినట్టే యాతఁడైనా యేలికకు కానిక చేతి కిచ్చితేఁగురుణ వుట్టు మోసముతో సామ్మెల్లా ముచ్చిలించి తిని వచ్చి దీనతతో లెంక యైతే దిగులెల్లాఁ బోవును చ. వాలాయించి దూరుచేసి వచ్చియెనా యేలికెకు వేళ గాచి కొలిచితే వేడుక పుట్టు యీలీల శ్రీవేంకటేశ యేజాతివాఁడైనాను మూల నీముద్ర మోచితే మునుపే రక్షింతువు