పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

105 రేకు: 0342-05 శ్రీరాగం సంపుటము:04-248 పల్లవి: అటమీఁదిపనులకు హరి నీవే కలవు సటలైన నిజమైనా జరపేముగాక చ. పరమాత్మ నీమాయఁ బాయగ నే నెంతవాఁడ దొరయైతే రాజాజ్ఞ దోయవచ్చునా తొరలిన యింద్రియాలఁ దోసిపోవ నెట్టవచ్చు సిరుల నేలికపంపు సేయు టింతేకాక చ. శ్రీపతి యీ సంసారము సేయకుండ నెంతవాఁడ మాపుదాఁకా రాచవెట్టి మానవచ్చునా పాపపుణ్యము లొల్లక పరగ నాకెట్టు వచ్చు తేపఁ దల్లి వుగువెట్టఁ దినకుండవచ్చునా చ. దేవ నీవిచ్చినమేను తెగి రోయ నెంతవాఁడ కావించి రాచయినావికిఁ గడమున్నదా శ్రీవేంకటేశ నీచిత్తములోవాఁడ నింతే యేవిధిఁ బెట్టినా నేనియ్యకొంటగాక రేకు:0023-06 సామంతం సంపుటము: 01-142 పల్లవి: అటు గుడువు మనస నీ వన్నిలాగులఁ బొరలి ఇటు గలిగె నీకు నైహితవిచారములు చ. కోరికలకునుఁ గలిగె ఫెయిరపరితాపంబు కూరిమికిఁ గలిగె ననుకూలదు:ఖములు తారతమ్యమములేనితలపాఁతలకుఁ గలిగె భారమైనట్టి లంపటమనెడి మోపు చ. తనువునకుఁ గలిగె సంతతమైన తిమ్మటలు మనువునకుఁ గలిగె నామని వికారములు పనిలేని సంసారబంధంబునకుఁ గలిగె ఘనమైన దురిత సంగతి తోడిచెలిమి చ. దేహికినిఁ గలిగె నింద్రియములను బోధింప దేహంబునకుఁ గలిగె తెగనిసంశయము దేహత్మకుండయిన తిరువేంకటేశునకు దేహిదేహాంతర స్థితిఁ 2ురాడఁగలిగె రేకు: 0339-02 వరాళి సంపుటము:04-227 పల్లవి: అటు గొన్నాళ్లందాఁక యిటు గొన్నాళ్లిందాఁక కటకటా శునకపు గతి యాయఁ గావవే చ. పసిమిఁ బాపమనేటి బందెలు మేసితిని కసరి దేహపు కట్టుగాడి నుంటిని కొసరి కర్మపుమెడగుదియ మోఁచితిని పసురమువంటివాఁడఁ బాలించవే చ. పంచేంద్రియములనే బాడిగె మోఁచితిని లంచపు సంసారమనే లాడిఁబడితి పంచల నాసలచేత బందము వెట్టించుకొంటి మంచినగుఱ్ఱమువంటి మూడుఁడఁ గావవే చ. మరిగి యజ్ఞానమనేమద మెత్తి తిరిగితి మరుఁ డనే మావటీని మాయఁ జిక్కితి గరిమ శ్రీవేంకటేశ కరిఁ గాచిత్రివిగాన కరి నైతి నన్ను నీవు కరుణించవే