పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

104 రేకు: 0344-05 దేసిసంపుటము:04-260 పల్లవి: అజ్ఞానులకివి యరుహము లింతే సుజ్ఞానులకివి చొరనేలయ్యా చ. దైవమునమ్మినదాసులకు కావింపఁగ మరి కర్మము లేదు దావత్రిజలనిధి దాఁటినవారికి వోవల మరియును వోడేలయ్య చ. గురుకృప గలిగిన గుణనిధికి అరయం బాపపుణ్యము మరి లేదు విరసపుఁ జీఁకటి వెడలినవారికి పరగ మరియు దీపంబేలయ్య చ. జగములెరుఁగు వైష్ణవులకును తగిలెటియపరాధంబులు లేవు అగపడి శ్రీవేంకటాధిపుఁ గొలిచితే యెగువ దిగువ మాకెదురేదయ్య పె.అ.రేకు:0014-06 గుండక్రియసంపుటము: 15-079 పల్లవి: అటమీఁద మరి యేమి నావలలేదు సర్వ ఘటన లన్నియు హరిఁ గన్నదాఁకానే చ. సరవితో వేదములు చదివేటి వెల్లాను హరినామరుచి గన్నయందాఁకనే సిరులతో యజ్ఞాలు సేసేటివెల్లాను హరిసేవపరుఁడు దానై నదాఁకానే చ. చలపట్టి తీర్ధాలు చరియించు టెల్లాను వెలయఁగఁ గర్మాలు బడుదాఁకానే మొలచిన తపముతో మునులై వుండే దెల్లా తలఁపులో హరిరూపు తగులుదాఁకానే చ. వేవేలుచందాల విజ్ఞాన మెల్లాను కావించి హరిభక్తి కనుదాఁకానే భావించే సకలోపాయము లెల్లాను శ్రీవేంకటేశ్వరుఁ జేరుదాఁకనే రేకు:0286-05 బైరవి సంపుటము: 03-498 పల్లవి: అటమీఁద శరణంటి నన్నిటా మాన్యము నాకు యెటు సేసినాఁ జెల్లె నిఁకనేల మాటలు చ. ఏది పుణ్యమో నాకు నేది పాపమో కాని శ్రీదేవుఁడవు నీవే సేయించేవు సేదదేర నా మీఁదఁ జిత్రగుప్నఁ డేల వా(వ్రా?సీ మేదిని స్వతంత్ర మేది మెరయు నీబంటను చ. పుట్టినట్టి తెరువేదో పోయేటి జాడ యేదో పుట్టించితి నీవే పురుషోత్తమ వెట్టి సంసారబంధాలు వెంటవెంట నేలవచ్చీ ఇట్టే యెవ్వరివాఁడ నిందులోన నేను చ. చిత్త మెటువంటిదో జీవుఁ డెటు వంటి వాఁడో హత్తిన శ్రీవేంకటేశ అంతరాత్మవు యెత్తిన మదము నిన్ను నేల కాననియ్యుదాయ నిత్తెము తొల్లే నేను నీవాఁడఁగాన