పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

103 రేకు:0243-04 దేసాళం సంపుటము: 03-245 పల్లవి: అచ్చుతు కృపాలబ్ధ మదియుఁగాక మచ్చిక నాతండు సేసే మతకముఁ గాక చ. నానాపాట్లఁ బడె నాఁడు కరి మకరిచే హీనదెస ప్రపదుడు హిరణ్యుచేఁ బాటువడె పానిపట్టి పూలి యుది పరిపూలించనివాఁడా ఆనుక హరిదాసుల కంతటనే భంగమా చ. తగిలి భీష్ముడు శరతల్పమందు నుండఁడా అగడై విభీషణుఁడు అన్నచేఁ దన్నువడఁడా పగపాడే చూచుచుండ భాగవతులను హరి (?) తగినపుణ్యుల నిందు తప్ప లెంచవచ్చునా చ. మంతనాన నారదుఁడు మాయలకుఁ లోనుగాఁడా చెంతల నర్జునునకు చేతులు దెగిపడవా ఇంతలో శ్రీవేంకటేశుఁడిట్టె వీని మన్నించఁడా ఇంతటి మహానుభావు లిందుకు జడుతురా రేకు: 0301-03 శంకరాభరణం సంపుటము:04-003 పల్లవి: అచ్చుతు శరణమే అన్నిటికిని గురి హెచ్చుకుందు మరి యెంచగనేది చ. Cయోనిజనకమగు యొుడ లిది యేనెల వైనా నేఁటి కులము తానును మలమూత్రపుఁ జెలము నానాచారము నడచీనా చ. పాపపుణ్యముల బదుకిది యేపొద్దు మోక్షంబెటువలె దొరకు దీపనబాధల దినములివి చూపట్టి వెదకగ సుఖ మిందేది చ. మరిగినతెరువల మనసుయిది సరవినెన్న విజ్ఞానంబేది యిరవుగ శ్రీవేంకటేశ్వరుఁడే వెరవని కంటే వెలితిఁక నేది రేకు: 0318-03 సామంతంసంపుటము:04-104 పల్లవి: అచ్చుతుడనియెడి నామముగలిగినయట్టి నీవేకాక కుచ్చి నీకు నేశరణని కొలిచితి గురుతుగఁ గావఁగదే చ. అణురూపగుమశకములోపల నణఁగిన నీకంటే గుణించి యెంచి చూచినను కొంచె మింకనేది ప్రణుతింపంగ బ్రహ్మండకోట్లు భరియించునీకంటే గణనకు నెక్కుడు నీవేకాక ఘన మిఁకనేది చ. దాకొని జగములు పుట్టించు బ్రహ్మకు తండ్రివి నీవే కైకొని చదువులఁ దెలిసిచూడ రక్షకులిఁక మరి వేరి యేకోదకముగ వటపత్రమున యీఁదేటినీకంటే దీకొనిపలికిన కాలంబుల కొనదేవుఁడు మరివేఁడీ చ. శ్రీవేంకటమున వరములొసఁగేటి శ్రీపతి నీకంటే తావుఁన గన్నులఁజూడఁగ బ్రత్యక్షదైవము మరివేఁడి వేవేలకు వైకుంఠవిభుఁడవై వెలిసిన నీకంటే భావించి చూచిన నంతరంగమునఁ బరోక్షదైవము మరివేఁడీ