పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
76

[అం 2

త గి న శా స్తి

ఉమా--వాళ్ళకి కాదు శిక్ష, మన కవుతుంది. నౌఖరీ వదులుకొని ఎక్కడికి పోగలము? పోతే పొట్టకూడో? వాళ్ల కాళ్ళా వేళ్ళా పడి బ్రతిమాలుకొందాము, ఏలాగొ సంధిచేసుకొందాము. వేరేదారి తొక్కొద్దు.
 రామ--నిజమే తప్పుదారి తొక్కినందుకు తగిన శాస్తి అయింది. ఇక బుద్ది వచ్చింది.
 పూర్ణే--సూర్యమూ, ఆడవాళ్ళు చదువుకుంటేఅబ్బేదేమిటో తెలిసిందా?
 సూర్య--ఇదిగో చెవులు నలుపుకొంటున్నాను. ఇక నెప్పుడూ ఆప్రసంగ మెత్తను. గతకాలము మేలు వచ్చుకాలముకంటేన్. ఇది మహావాక్యము.

--00--