పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 6]

75

త గి న శా స్తి

 రామ--చెప్పుచప్పు అదీ విందాము.
 సూర్య--చెప్పింది కేముంది? ఆలస్యంగా ఇంటికి వచ్చినానని అన్నము పెట్టలేదు. కొంచెము బెదిరించినాను, వెంటనే మూలనున్న చీపురు తీసి మూడుదెబ్బలు కొట్టింది, నొప్పి ఇంకా పోలెదు.
 ఉమా--ఇంతవర కొచ్చింది, ఇంకెంత వరకూ పోతుందో ! ఏమి సాధనము?
 సూర్య--ఖమించుమని మొర్రపెట్టుతూనె ఉన్నాను. మానితేనా? మరీ జో రయింది. తలుచుకొంటే ఇప్పుడు తగుల్తూఉన్నట్లుంది.
 రామ--వీళ్ళ పెంకితనము మితిమీరుతూన్నది.
 సూర్య--అప్పుడే వెళ్ళీ పోలీసువారికి రిపోర్టు చేసినాను.
 పూర్ణే--బాగా చేశావు.
 సూర్య--ఇంతవరకూ ముదిరిపోయింది, ఇక నేమీ లాభముండ దనుకొంటాను.
 పూర్ణే--అయినదాని కేమి? ముం దేమి దారి?
 ఉమ--నే నప్పుడే చెప్పినాను, విన్నారుకారు నామాట; ఇప్పుడు విచారిస్తే నేమి లాభము?
 సూర్య--పదండి అందరమూ కట్టకట్టుకొని Educate అవుదాము. వీళ్ళజోలి మనకు వద్దు, మనదారిని మనము పోదాము.