పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
62

[అం 2

త గి న శా స్తి

భార్యాభర్తలకి పంపకాలు పుట్టుతివి, నవయుగమాహాత్మ్య మీలాగు పరిణమిస్తుంది కాబోలు!

 సుకే--డబ్బున్న దగ్గిరల్లాఎప్పుడూ పంపక ముంటుంది, అన్నదమ్ములకే కాదు, అక్కచెల్లెళ్లకే కాదు, అంతటా ఇదే ధర్మము; ధనము లెకపోతే ఏతగాదాలేదు.
 రామ--భక్తి, ప్రేమ, అనురాగము, ధర్మము--అనెవి నశించి కేవల ధనమే పరమార్ద మయింది. సనాతన ధర్మము సన్నగిల్లింది, ఆదర్శము లగ్నిదిగ్దము లైనవి. ఇక పూర్వపశ్చిమ దేశముల భేరము నశించింది. ఏమివింత?
 సుకే--మాకళ్ళలో దుమ్ముజల్లి, మ మ్మిళ్ళలో పాతిపెట్టి, చదువు చెప్పించక, బుద్ది వికసింపనీయక నూతిలో కప్ప లనుచేసి మూలకు నెట్టి అన్నివిషయములా మీకనుకూలముగా వ్రాసి పెట్టుకొని మాకుగ్గుపాలనాటినుండి దాసీధర్మము నేర్పనారు. మేమదే ఉభయతారకమనుకొని భ్రమపడ్డాము. కాస్తకన్ను తెరచి చూస్తే మీపక్షపాటబుద్ది విశదమ;యింది,మాకు స్వేచ్చప్రసాదిస్తే మీ ఆటలు సాగిరావు.ఈ బానిసతన మెన్నితరములనుంచో  అనుభవిస్తూన్నాము. ఇప్పటికి తెలివివచ్చింది, మీకూ మాకూ సమానమైన హక్కులున్నవి. మాకన్న మీరు హెచ్చుకారు, తెలిసిందా? మీతొ సరిసమానముగా మేముండదగినవాళ్ళము; అట్టి హక్కులు మాకిచ్చినట్లయితే మీకూ మాకూ పొసగుతుంది. లేకుంటే ఎవరిదారి వారిదే! (త్వరగా లేచిపోవును)