పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 5]

68

త గి న శా స్తి

 రామ--తొండ ముదిరి ఊసరవెల్లి అయింది.ఇదే నాకు ultimatum ఇచ్చింది,అన్నంతపనీ చేసి తీరుతుంది; మిడిమిడిజ్ఞానము కలిగిన ఇదే ప్రమాదము.నేను లేకపోయినా దానిపొట్ట అది పోసుకోగలదనే ధైర్యము చిక్కింది. ఇప్పటి ఆడవాళ్ళు మగవాళ్ళపై నధారపడడము భుక్త్ కొసమే కాని భక్తికోసము కాదు. మగవారియందు ప్రేమచేకాదు, ధనముపై ంప్రేమచేత; ధనమార్జించుకొనగలిగిన స్త్రీలకు భర్త అవశ్యకత లేదు; ఏదొ వంక పెట్టి అతని కుద్వాసన చెప్పి తీరుతారు. నాగతి  యింతకు వచ్చింది. హా! పరమేశ్వరా! ముందేమి చేయదలచినావోకదా!

---

---?ఐ దో రం గ ము?---

---

సుహాసినీ పూర్ణేందులు.

 పూర్ణే--పాడుముండా చదువు ఆచారము అన్నిటినీ పాడుచేసింది. ఆపెద్దమ్మ కేమి చెప్పినావో కాని అది పునస్సందానాని కొప్పుకో లెదు.
సుహా--అవును, కోతిలాటివాడిని కట్టబెడితే దాని కాపుర మెలాగు తగులబడుతుంది? ఒకరొజా రెందురొజులా, జన్మమున్నంత కాలమూ జరుగవలసిన సంబంధము కదా? దొండపండువంటి పిల్లని కాకిముక్కుకి కట్టిపెట్టినారు. మొర్రో వద్దని నేను మొత్తుకొన్నాను,అదీ కంటికీ మంటికీ ఏక