పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 4]

61

త గి న శా స్తి

ఇంతగర్వము నీకుండదగునా?...నిన్నన్న పనిలేదు స్వయంకృతా పరధానికి తగినశాస్తి చేసినావు. లే...నీమనసుకి నచ్చినట్లు నేను జరుపుతే ఊరకుంటావు, లేకుంటే ఎదురుతిరుగుతావా? అందరూ చావగా మిగిలిన బిడ్డలిద్దరే గా? వాళ్ళని చూడలెవా?

 సుకే--సవతితల్లిని కనుక మీరేమన్నా ఎవరైనా నమ్ముతారు. డబ్బు తెచ్చినన్నాళ్ళూ అంతా ఖర్చు చేస్తూంటే మీదు కన్ను మూసినతరువాత నాగతి ఏమి కావలసింది?
ఇప్పటి వరకూ గాజుల బేరము భోజనానికి సరిపోతూంది, ఎర్రని ఏగాణి వెనుక వేసుకో లేదుకదా? మీపిల్లలిద్దరూ రెక్కలు వచ్చినవాళ్ళు కనుక వారిదారిని వా రెగితిపోతారు, మిగిలినదాని నొక్కర్తెనే; మీపేరు చెప్పుకొని నేను నీళ్ళ బిందెలుల్ మూసుకోనో, లేకుంటే ఏవరింటైనా వంటకి కుద్రుకొనో జీవనము చేసుకొవలసి వస్ద్తుంది. అలాంటిగతి పట్టకుండా ఉండేటందుకు నాడబ్బు వెనుక వేసుకొంటున్నాను. అదిచూస్రే మీకందరకీ కన్నెర్రగా ఉంది. మీస్దితిని మొదట నుండీ చూసినదాన నౌటచేత వెలుగుండగానే వెతకుకొంటున్నాను. నే నెవరికీ నఘరణ యివ్వను, ఏ బాంకిలోనో వేసుకొంటాను. స్త్రీధనముమీద మీకు హక్కు లెదు. నాజాగ్రత్త నేను పడకపోతే నాగతి ఏమి కాను?
 రామ--ఎంత దూరాలోచన చేసినావు! అన్నదమ్ములకీ అక్కచెల్లెళ్ళకీ పంపకాలిప్పుడున్నవి కాని ఇకముందు