పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
54

[అం 2

త గి న శా స్తి

 సువే--ఉద్యోగము...ఆకుర్చీ దగ్గిరగా లాగండి, కాళ్లు పెట్టుకోవాలి.
 ఉమా--ఉద్యొగము చెస్తుందా ఆడది?
 సువే--అందులో ఆశ్చర్య మేమి? చదువుకొన్నందుకు సార్దమ మేమి? ఆడవా ళ్ళుద్యోగము ఛెయకుంటే ఘోషా అనుపత్రు లెలాగు అభివృద్ది చెందుతవి? గరల్సుస్కూళ్లేలాగు సాగుతవి? మనదేశము బాగుపడడ మేలాగు?
 ఉమా--చదువుకొన్నవాళ్లుద్యొగమే ఛేయవెలెనా? 
సువే--ఔను మనపిల్లని టెలిగ్రాఫ్ డెపార్టుమెంటులొనో మెడికల్ లొనో ప్రవేశపెట్టుదా మనుకొంటున్నాను. ఉద్యోగము దాని కష్టము లేకపోతే మీఘరణ ఉంది కదా? హాయిగా యింట్లో కుడిచి కూర్చుంటుంది. జోడుతాడు  జారి పోయినట్లుంది. గట్టిగా కట్టలేదా ఏమి?
 ఉమా--(కట్టి) మీయిద్దరిఊహ నాకు నచ్చలెదు.
 సువే--Pooh! మీ యిష్ట మేమిటి? మీపేద్దరిక మెవరొప్పుకొంటారు?... వీధులలోకి వెళ్లుతారా? ఇంట్లోనే ఉంటారా? ఎందు కీ వ్యర్దప్రశంస్?
 ఉమా--వెళ్లవలెననే ఉంది. వెళ్ళనా వద్దా?
 సువే--వెళ్ళొచ్చు కాని పొద్దు కుంకేసరికి రావలెను, నా నవల కొంత discuss చెయ్యవలెను, ఉండిపోయింది;
 ఉమా--పగలంతా కచేరీలో తెగవ్రాసి వేళ్లు నొప్పి పెట్టినవి. రేపు ఆదివారము కనుక వ్రాయవచ్చును.