పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 6]

37

త గి న శా స్తి

---:ఆ రొ రం గ ము:---

---

పాత్రునింట్లో పాత్రుడు

 పాత్రు--నేను వీళ్ళని పోషించడ మేలాగు? మునుపు ఒక్కడినే ఉండేవాడిని గనుక అప్పో సప్పో చేసి తంటాలుపడేవాడిని. ఇప్పుడో --With so many mouths to feed! by Jupiter--they are quite a legion--ఏమి చెయ్యవలెనో తోచకుండా ఉంది. ఎంతో దూరము నుంచి ఒక పాత encumbrance వచ్చి నెత్తిమీద పడ్డది. పెళ్ళాడిన పెళ్ళాము, తగిలివేస్తే దాటిపోయేది కాదు, అందుపైని పిల్లలు అసలుమీదవడ్డీ లాగు ప్రతి సంవత్సరమూ పెరిగిపోయినారు; కడుపున పుట్టినవాళ్లు, కాటిని పెట్టలేను. ఇప్పుడీ wife ను ఏమి చేయవలెనో చెప్పే మహాత్ముడేడీ? ఉమాకాంతము కొంద రాడవాళ్లకి చదువు చెప్పడానికి European Mistress  కావలెనని చెప్పినాడు. ఇదా పనిచేయగల్గితే నెలకి నూరు రూపాయీలు ఇవ్వడానికొప్పుకొన్నాడు. By Jingo, that is a good idea, Rebecca, my dear, my love--
 రెబె--What for?
 పాత్రు--నేనొక plan వేసినాను, ఏమని చెప్పుదును? మనపిల్లలు చావడానికి సిద్ధముగా నున్నారు.