పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
36

[అం 1

త గి న శా స్తి

 సరో--యత్నము చేస్తాను. కావలసినవాళ్లకోసము కష్టపడక తీరుతుందా? ఎంతకష్టమయినా సాధించి తీరవలెను. నాకు నచ్చినవాడు నీకు నచ్చునో లేదో?
 ఇందు--నీవే నాకు పరమబంధువువని ఎంచుతూన్నాను. తింటూఉంటే పలబారినట్లూ, నవ్వుతూంటే ఊపిరందనట్టూ, నడుస్తూంటే బొంగిల్ల పడినట్లు. నానోటమాట రాకుండా ఉంది. తగినవాడిని చూసిపెట్టు. నాప్రాణాలు నీచేతిలొ పెట్టినాను.ఇక నీదే బారము. నీకు నచ్చితే నాకు నచ్చినట్లె, నీమాట కాదనను..(పోవును)
 సరొ--అయినది, పంజరములో పిట్ట గొలుసు తెంచుకుంది. నా దేమి నేరమ్? నేను ఆ ఊసు తలపెట్టకుండానే ఆమె బయటపడ్డది. ఇక నేను క్షణమువేస్తే అగ్ని రగిలి తీరుతుంది. నేను చేసేది చెడ్డపని కాదు. కక్కుర్తిపడి కాని పనులుచేసిన కన్న గౌరవముగా బ్రతికేదారి చూపినాను. దాని నుదిటివ్రాత ఏలాగుంటే ఆలాగు జరుగుతుంది.

(వెళ్ళును)