పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 5]

35

త గి న శా స్తి

దులలాగు రుచీపచీ లేకుండా, అంతా పాతబడి నిస్సారమయింది. అర్త్దమూ లేదు బావమూ లేదు ఈ కవితకి.

 సరో--నీ అవస్ద కడు జాలికరముగా నుందే.ఇప్పుడేమి చేయదలచినావు?
 ఇందు--ఏదీ తోచదు. నాయవ్వనమంతా కడచిపోతూంది. చక్కని రాజమార్గ ముండగా సందులు గొందులు దూరుతూన్నాను. నాహృదయ మనే గోడనుండి కోరిక అనే సున్నము చలచల్లగా జారిపోతూంది.ముందేమవుతుందో తోచలేదు. నేనేమిచెయ్యవలెనో చెపు.
 సరో--వెంటనే పెళ్ళి చేసుకో.
 ఇందు--పెళ్ళీ చేసుకోమంటావా?
 సరొ--ఇంకో విధాన ఈ అలసట తీరదు.
 ఇందు--అప్పుడప్పు డలాగే అనుకొంటాను. కాని పాడుముండ భయము చేసుకోనీయదు. నీవు నాకమితోపకారివి, నా మనసులో మాట చెప్పినావు; ఇప్పుడు నాకు? నచ్చింది. భోజనానికి కెక్కడికైనా వెళ్ళితే ఏవస్తువైనా తినాలని ఉంటుం దనుకో, మొగమాటముచేత అడిగివేయించుకోము, పక్కవా రెవరైనా "మరికొంచెము వేయించుకో" అని హెచ్చరిస్తే వెంటనే వేయించుకొంటాము... పెళ్ళి చేసుకొంటాను కాని ఎవర్ని చేసుకోవడము.
 సరో--తగినవాడిని తరచి చూసుకొవాలి.
 ఇందు--ఆపని నాచేత కాదు, నీవు చూచి పెట్టవూ?