పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 5]

33

త గి న శా స్తి

  వీరే--ఎంతమాటన్నావు! నిన్ను మరచిపోవడమె! నేను చెప్పిన పని నీవు నిర్చహిస్తే నేను చెప్పినమాటా సార్ధకము చేస్తా!, నిన్ను దగాచెయ్యను, నామాటనమ్ము, ఇదిగో దైవసాక్షిగా ప్రమానము చేస్త్గున్నానుయ్. ఇప్పుడు నిజమని నమ్మకము కలిగిందా? మరచిపోకుమా(వెళ్ళబోతూ) పాత్రుడు నన్ను కొట్టి తగిలివేయడ మొకవిధముగా మేలేఅయినది దెబ్బతిని ప్లీడరుదగ్గరికి వెళ్ళి కొంతభోగట్టా కనుక్కొన్నాను. ఈ పని సానుకూలమైతే ఈ పాత్రుడూ మావదినెగార్ల పని పట్టుతాను. నాకు బుద్దిలేదని నలుగురూ అంటున్నారు. నాసత్తువచూపుతా..(వెళ్ళును)
 సరో--దీనిలొ నేదో రహస్యముంది. ఇందుమతి పెళ్ళికి ఇతని కింత ఉబలాట మెందుకో ? ఇతనేదో పెద్దఎత్తు మీద నున్నట్లుంది...నేను పాత్రుడుగారి యింటికివెళ్ళడమెలాగు? అతనిపేరు విన్నానే కాని అత డెలాటి వాడో అరుగను. కార్యము సాధించుకోవలెనంటే కానిపనులెన్నో చెయ్యవలసి వస్తుంది. తీరా అందుకు సిద్ధపడినా నాకార్యము నెరవేరుతుందో లేదో? ఇందుమతి నొప్పించడము సుళువే. వడ్దించేవాళ్ళే కొరత, ఆమె ఆకు వేసుకొనే ఉంది.
                 (ఇందుమతి వచ్చును)
  ఇందు--సరోజిని, నా కలా గుందేమి?
  సరో--ఏలా గుంది?