పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
32

[అం 1

త గి న శా స్తి

గొప్పో డబ్బూ ఇస్తుంది. ఇంతకన్ననాకేమి కావలెను?...ఈ ఉపకారము నీవు చేస్తివా నీకూ నాకూ లాభముంది తెలిసిందా?

 సరో--సరే కాని ఆమె వితంతువుగదా మారుమనువు చేసుకొంటుందా?
 వీరే--మనదేశములొ నెందరు పెళ్ళాడలేదు?
 సరో--అలాగైతే, వెలి కెవడొప్పుకుంటాడు?
 వీరే--విత్త ముంటే వెలి కెవడు వెనుకతీస్తాడు?
 సరో--ఆమెకు తగినవాడు దొరకవద్దా?
 వీరే--పైసా చూసి పదిమంద్ చేసుకొంటారు. ఎవరూ లేకపోతే ఉన్నాడుగా మన పాత్రుడు! అత డిప్పుడన్నిటికీ సిద్ధముగా ఉన్నాడు. అరకాసు లేదు వానిచేత.
 సరొ--అతను కిరస్తాని దాన్ని పెళ్ళాడినాడో!
 వీరే--పరి రూపాయీలు పారవేస్తే ప్రాయశ్చిత్తము చేయిస్తారు మన గురువులు.
 సరొ--పెళ్ళికితడొప్పు కొంటాడా?
 వీరే--అదే నీవు చేయవలసిన పని అతనికి సొమ్మత్వవసరము. అతని చెవిని ఈమె సంగతి వేసి నాలుగు మంచి మాట లాడితివా నీవ్చలలో చేప పడ్డదన్నమాటే.
 సరో--తీరా ఇదంతా కురిరిస్తే మీరు  నన్ను మరచి పోరు గదా?