పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 5]

31

త గి న శా స్తి

దేమిటి? దీని మూలముగా నా కార్యసాధన మయితే తప్పకుండా పెళ్ళాడుతాను. కాపురము సరిపడ్డదా మంచిమాటే, లేకుంటే ఇంకొకర్తె...*(పైకి)వదినా!

 సరో--ఓహో మీరా! (లేచుచు)
 వీరే--బాగా ఆలోచించి నిన్ను పెళ్ళాడవలెనని నిశ్చయించినాను. ఏ మంటావు?
 సరో-- ఇం కెవ్వరూ దొరకలేదు కాబొలు లేక హాస్యమాడుతూన్నారా?
 వీరే-కాదు, నన్ను పెళ్ళాడవలెనంటే ఒక్కపని చేయవలెను నీవు.
 సరొ--ఏమి టా పని? మీకొస మేమి చేయుమన్నా సిద్ధమే. అసాధ్యపు పని కాదు కదా?
 వీరే--అలాటి పని నిన్ను చేయు మంటానా?-- సులభమే నీవు తలచుకొంటే నాప్రాణాలు నీచేతిలో పెట్టుతూన్నాను...మావదినె పెళ్ళాడేలాగు ప్రయత్నము చెయ్యవలెను. ఆవిడ నీమాట తప్పకుండా వింటుంది.ఆమె నెలాగైనా ఒప్పించాలి పెళ్లికి.
 సరొ--ఆమెపెళ్లాడితే మీకేమి లాబము
 వీరే--(తనలో) ఆడవాళ్ల నోట్లో నువ్వుగింజ నానదు, ససలుద్దేశము దీనితొ చెప్పకూడదు. (పైకి) తన పెళ్ళి సిద్ధమయినదంటే మావదినె నాపెళ్ళీ కొప్పుకొంటుంది. మన మిద్దరమూ హాయిగా పెళ్ళాడుకోవచ్చును. కొద్దో