పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 4]

29

త గి న శా స్తి

 పూర్ణే--నీవు గడబిడ చేయకు మిడిమిడి జ్ఞానమున్న మనవాళ్ళింగ్లీషు చదువు చెప్పితే ఇలాగేఉంటుంది; దొరసానులచేత చెప్పిస్తే యీలాగుండదు.
 ఉమా--ఇప్పుడు కాకరకాయ అప్పుడు కీకరకాయ అవుతుంది. నేనొక్కడినే తోకలెని తోడేలుని కానులే, we are all in the same boat ఇది కొంత నయము.
 రామ--నిజమే, మాకింతకన్న ఎక్కువ మర్యాద జరిగింది, చెప్పుకుంటే సిగ్గు. కడుపు కోసుకుంటే కాళ్ళ మీద పడుతుంది.
 పూర్ణే--దొరసానెక్కడ దొరుకుతుంది? ఎక్కడికి పోను? ఎంత వెతకను? 
 సూర్య--ఎక్కడికీ పొనక్కరలేదు, ఎంతోసేపు వెతకనక్కరలెదు. పాత్రుడుగారి దొరసాని ఉన్నది; ఆవిడచేత చిప్పింతాము.
 ఉమా--బాగుంది...అత డెవర్తెనో వితంతువుని వివాహమాడి పాతిక వేలు వడిలో వేసుకొందామనుకొన్నాడు. కాని పాపము శృంగభంగ మయింది. మన మిప్పుడు చేతామనుకొన్న దానివల్ల మనకె లాబమూ లేకపోయినా అతనికి కొంతుపకార మౌతుంది. అతని కిప్పుడు దినదినగండముగా నుంది. మన మొక తృణమిస్తే  కొంతనయము కావచ్చును.
 పూర్ణే--అలాగయితే నాకిష్టమే. రేపే నీవతనితో మాటలాడి తగిన ఏర్పాటు చేయవచ్చును.