పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
28

[అం 1

త గి న శా స్తి

 సూర్య--నీకేమి మతిపోయిందా?
 ఉమా--To be or not to be...పదండి. ముందు కడుపులో ఏమైనా పడితేనే కాని మంటపోదు. తర్వాత సావధానముగా మనవి చేస్తాను. ఏమి జరిగిందో.
 పూర్ణే--ఇప్పుడు టూకీగా చెప్పకూడదూ?
 ఉమా--ఏమని చెప్పను? మీఅందరిమాటా విని ఆడదానిని educate చేసి ఇచ్చి దానిఫలమనుభవిస్తూన్నాను.
 రామ--ఏ మనుభవించినావు?
 ఉమా--గోలంతా గాడిదలాగు కచేరీలో పనిచేసి కేసులన్నిటికీ judgements వ్రాసి, సగము చచ్చి, ఇంటికొచ్చి ఫలాహార మేమేనా ఉందా అని అడుగుతే నా పెళ్ళాము తనకేదో engagement  ఉందని ఇంటినుండి ఉడాయించింది. ఈరాత్రి నాకు తిండి ఉండదు. ఇప్పుడే కడుపు కాలి చస్తున్నాను కదా, ఈరాత్రి నాసంగ తేమికాను? Female Education  వద్దని మొత్తుకున్నా నిందుకే.
 సూర్య--ఇదొకస్వల్పవిషయము, వాళ్ళకామాత్రము liberty ఇవ్వాలి. అదిస్తేనే కాని education complete కాదు.,
 ఉమా--ఉప్పు లేకే ముప్పందుము, ఉప్పుంటే ఊరుగంజంతా చాల న్నట్లు వీళ్ళకి liberty కూడా యిస్తే నాబోటివాళ్లు నాలుక గీకుమొకొని చావవలసిందే.