పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
26

{అం 1

త గి న శా స్తి

   సువే--ఫలాహారమా?
   ఉమా--చిత్తము, ఫలాహారమే.
   సువే--My goodness! మరచిపోయినాను మీసంగతి.
   ఉమా--ఉద్దరించినావు! నీవు చేసిం దేమిటి? తలదువ్వుకొని,  గౌను తొడిగించుకొన్న మేజోళ్లూ బూట్సు తొడుక్కొని, పచారుచేస్తూ నీవు పార్టు చదువుతూండు; నేను పస్తుండి మలల మాడుతూంటాను.
  సువే--Eating with another thing or two reminds us of our morality అని Byron అన్నాడు. 
  ఉమా--నీ Byron కాలే కడుపులొ మండ్ పొతూంటే ప్రానాలు నిల్చేటట్టు లేవు.
  సువే--మీ ప్రాణాలమాట కేమిగాని నాప్రాణాలు కొరికేస్తున్నారు. ఇదిగో ఇప్పుడు ఫలాహర మేలాగొ చేస్తాను, కాని రేపటినుండి మీ ఫలాహార ప్రయత్నము మీరే చేసుకోండి.. ఏవిదీ! తాలముచెవి ఏదీ? (అతనివైపు చూచును)
   ఉమా--నామొగముమీద తాళముచెవిఉన్న దనుకొన్నావా, చూస్తున్నావు? నాకిచ్చినావా?
  సువే--అది కాదు, మునుపు పైటకొంగుకి ముడి వేసేదానివి, ఇప్పుడది లేకపొవడముచేత  చేతగుడ్డకి కట్టినాను; ఆ అదెక్కడో జారిపోయినది అలవాటు లేకపోవడముచేత. ఈ  సారి గౌనుకి జేబు ఉంచమని చెప్పుతాను దర్జీతో.