పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 4]

25

త గి న శా స్తి

  ఉమా--ఇప్పుడు నేనాకలితో suffer అవుతునే ఉన్నాను, తిండి కేమైనా చేసినావా? లేదా?
  సువే--Or to take arms--
  ఉమా--ఏమి టీ వేషము?...చెప్పవేమి? 
  సువే--against a sea of tradition.
  ఉమా--ఇంతసేపూ కచేరీలో చచ్చిచచ్చి ఇంటికి వస్తే Hamlet's soliloquy చదువుతూన్నావా? అది వింటే నాకడుపు నిండుతుందా? కాఫీ నీళ్ళేనా ఉన్నవా?
  సువే--ఇప్పుడు disturb చేయకండి, కొంచెమాగలేరా? And by opposing end them.
  ఉమా--అది నాచేత కాదు నీవీ soliloquy end చేసి కొంచెము నాగోలవిను. కడుపు మండుతూంది, గొంతుక ఎండుతూంది.
  సువే--To die, to sleep, to sleep--perchance to dream.
  ఉమా--ఇది dream చేయడానికి సమయము కాదు. నాకడుపులో కార్చిచ్చులాగు ఆకలి మండుతూన్నది.
  సువే--Ay, there's the rub
  ఉమా--ఔను ఇదే rub, ఆకలివేయకుండా ఉంటే ఏగొలా లేకపోవును. ఓ దేవీ! నీస్వర్గమునుంచి ఒక్కసారి మా పాపమర్త్యభూమికి దయచేయుము. ఫలహార మేమైనా చేసినావా? కడుపుకాలుతూండి.