పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
24

[అం 1

త గి న శా స్తి

   సువే--ఐతే మీ వారింకా కచ్చేరి నుంచి రావడము ఆలస్యము చేసినా రేమి? ఆయన వస్తే ఆబండిలో మనము వెళ్లేవాలని చెప్పినావు కదా?
  సంకే--చెప్పినాను, ఇప్పుడేవస్తారు, చాలా obedient husband  మావారు.
  సుహా--ఇంటికి బండి ముందుగా పంపి ఆయనను నడచి రమ్మనిపంపింది, wait చేయనక్కరలేకపోవును.
  సుభా--ఆదిలో వచ్చినట్లుంది. వేగము  powder  వేసుకోవలెను లెండి.
  సుహా--సువేషిణి, నీవు powder  రాసుకోవూ?
  సువే--నాకు powder అక్కరలేదు. మీరంతా పూసుకోండి, ఇంతలో నా part చదువుతూంటాను.
  (పచారుచేస్తూ) To be, or not to be, that is the question.
                (ఉమాకాంతము వచ్చును)
   ఉమా--(ఉస్సురని చొక్కా విప్పి) నీవే ఫలహారముందా?
   సువే--Whether it is nobler in the mind--
   ఉమా--వినిపించుకో వేమి? పలాహారము చేసినావా?
   సువే-- To suffer...