పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
20

[అం1

త గి న శా స్తి

  వీరే--నా నల్లమందుబాధ నీకెందుకు? నాసొమ్ము పెట్టి నేను కొనుక్కొన్నాను. కాని నీఅబ్బ సొమ్మేమైనా యిచ్చినావా?
  పాత్రు--Shut up నోరుమూసుకో Fool, get away పోరా బికారీ!
 వీరే--మాటలు మత్రము సరిగా రానీ, ఫూల్ గీలంటే నేనొప్పుకోను.
  పాత్రు--అబ్బా! రోషము వచ్చిందా? Get out, you blackguard. (కర్రపట్టుకొని రాగా పొవును) Case మాటేమీ లేదు. Time అంతా waste చేసినాడు. పిల్లని చూచిపెట్టాలట; నేను fool నని వీడి ఊహ, ...Ha! He intends to marry rich అందరిదీ ఒకటే ఎత్తు... మంచిదే...పనీపాటూ లేకుండా పదము గడిచిపోతుంది...నేను కరుణాకర కూతురుని పెళ్ళడితే by the Gospels of St.Zachary  నారొట్టె నెతిలో పడ్డట్టే! ఒక్క క్షణములో I shall become rich,  బాగానే ఉంది. మొదట పెళ్ళి కానీ... అందులో but ఒకటుంది.. నేనొక European girlని లోగడ పెళ్ళిచేసుకొన్నాను, అదే objection... కాని  marriage  ఈపాటికి  null and void  అయి ఉంటుంది; అంత చతురతతో manage చేసినాను. ఆ wife నన్ను పోల్చుకోలే కుండా మాయచేసినాను!..దాని మాట కేమి.. దీనిని పెళ్ళాడితే Twenty five thousand