పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
18

[అం 1

త గి న శా స్తి

 వీరే--కేసే తెచ్చినాను, కొంచె మలసట తీర్చుకొని చెప్పుతాను.
 పాత్రు--ఏమి కేసు? Assault? trespass? theft? rioting?... ఇదిగో (పెద్దపుస్తకము తెచ్చి కాగితాలు తిరుగవేసి) rioting section-whoever (వీరే: కాదని తల ఊపును) Rioting?  కాదా? hurt? wrongful confinement? murder? (ఇంకో పుస్తకము తెచ్చి పేజీలు తిరుగవేసి ఇదిగో చూడు Taylor's Medical Jurisprudence లో ఏ ముందంటే..

వీరే--ఆగవయ్యా! ఇదలాటి case కాదు ఇది ఒకాడదానికి మగవాడికీ... పాత్రు--Enticing away. Kidnapping? adultery? rape? Oh my ! ఆ విషయమున Snell's Equity అని నాదగ్గర ప్రశస్తమైన గ్రంధముంది, అది latest authority.

  వీరే--ఆగవయ్యా, ఇదలాటి case కాదు. ఆతుర పడక విను.. సంగ తేమంటే...నాకు పెళ్ళాడవలెనని ఉంది, మావదినె కానీయకుండా ఉన్నది.
  పాత్రు--దావా చేస్తెసరి.
  వీరే--ఏమని దావా? ఎందుకోసము?
 పాత్రు--ఎందుకు కూడదు? ఈ Civil and Criminal Courts  ఎందుకున్నవి? penal Code  దేనికోసము