పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 3]

17

త గి న శా స్తి

ఉందురు. వీళ్ళకి పాములా ఒళ్ళంతా కడుపే Drink తర్వాత నా కేదీ నోటికి పోదు. జానేడుపొట్టా George Whisky తో నిండితే తిండికి చోటేదీ? వీళ్ళకి dinners నే నివ్వలేను. Boy, Boy, ఎవడుగా అక్కడ?

  నౌకరు--బాబూ! వస్తున్నాను.
  పాత్రు--గాడిదా! ఏమి చేస్తున్నావు? Rascal,  వెళ్ళిచూడు ఎవరేనా  clients  వచ్చినారేమో.
  నౌఖరు--చిత్తం (పోవును)
  పాత్రు--తండ్రిగారి ఆస్తి దగ్దమయింది; ఇప్పటి భోగమంతా బుడ్డీలో వుంది. ఇన్నాళ్ళూ (unemployment bureau)  నిరుద్యోగము  department లో కాలము వెళ్ళబుచ్చినాను. ప్రయాసము లేకుండా practice  దొరుకుతుంది; కనబడితే చాలును, ఘళ్ళుమని రూపాయీలు రాలుతవనుకొన్నాను. కేసురానిదే కేకలు వేయడ మెలాగు?
                (తెరలో పాత్రుడుగారూ?)
   ఆ నల్లమందు భాయిలాగున్నాడు, చంపుకో తింటాడు...Come in, my friend.
             (వీరేశ్వరుడు వచ్చును)
   What news  ఏమి విశేషాలు?
  వీరే--మీదర్శనానికే వచ్చినాను.
  పాత్రు--తెలుస్తునే ఉంది ఏదైనా కేసా?