పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
14

[అం 1

త గి న శా స్తి

వేసుకొని తాను గొప్పది కాలేదా? అలాగే నాపెళ్ళాము సొమ్ము తిని పెద్దవాడి నౌతాను నేను..ఏమే సరోజినీ, నామట తప్పా నీవు చెప్పు...ఏమి? అలాగు రెప్పవాల్చకుండా నావైపు చూస్తూన్నవు? ఏమిటి సంగతి?

  సరో--(వంకచూపు చూసి నవ్వును)
  వీరే--ఊరకున్నావేమి? (పువ్వుతో కొట్టును)
  సరో--బాగుంది! (పువ్వుతో కొట్టిపోవును)
  వీరే--ఈ వాలకము కొంచెము లాభించే టట్లుంది. వా!వా! దీనిని వదల కూడదు.
                  ---

---? మూ డో రం గ ము ?---

                    ---

బారిష్టరూ మిత్రులు.

   పాత్రు--ఇక్కడ నా కేమీ practice దొరకలేదు.
   మన్యం--కనపడుతూనే ఉంది. ఏం చేయ బోతావు?
   లింగం--Moffusil bar join  కవద్దంటే మానినావా?
   పాత్రు--ఔను, తప్పే, ఇప్పుడు పట్మము పోనా? I think that is the only course to follow.
   వాసం--వద్దు, ఎక్కడికీ వెళ్ళకు. ఇక్కడే ఉండి ఏదో Society లో చేరు త్వరగా నిన్ను Secretary ని చేస్తారు. దానివల్ల కొంతలాబ ముంటుంది.