పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 2]

13

త గి న శా స్తి

  వీరే--అది చెప్పలెను. పెళ్ళికావడముతో నే పనీ పాటూ లేకుండా హాయిగా కాలుమీద కాలువేసుకొని  కూర్చుండడానికి వీలున్నదానిని పెళ్ళాడవలెనని ఉంది. భాగ్యవంతులపిల్ల నెక్కడైనా చూసిపెట్టవూ? అబ్బా! ఇరుగు పొరుగువాళ్ళ దెబ్బల కొర్వలేకున్నాను.
 ఇందు--నీకు పిల్ల నివ్వడాని కందరూ సిధ్దపడినట్టు చెప్పుతూన్నావు! ఏపనీ చేతగాని ఏబ్రాసి నల్లమందు భాయివి, నీ కెవరు పిల్ల నిస్తారు.
  వీరే--ఇవ్వకేమి? నాకేమి తక్కువ? ధనమున్న దానిని చేస్తివా దానిని కనిపెట్టుకొని ఉంటాను. కూర్చున్న దగ్గరనుండి లేవను.
 ఇందు--ఇప్పుడు నీవు చేస్తూన్న రాచకార్య మేమో? 
 వీరే--నాకు ప్రస్తుత మెంతో చిక్కుగా నుంది. మాత్రకి కావలెనంటే ఎందరి నడిగినా ఎవరూ ఇవ్వరు కడుపునిండా తినడానికే కరువు వచ్చింది, పదిమందికి పెట్టడానికి మొదలే లేదు.
  ఇందు--నీ పెళ్ళిఏర్పాటు నీవే చేసుకో,నాకేమి పట్టింది?... ఆదదాని సొమ్ముతిని హాయిగా కూర్చుంటావా? అందుకు సిగ్గులేదేమి?...(వెళ్ళును)
  వీరే--తా నేమీ చెయ్యడట! నేనే ఏర్పాటులు చేసికొవలె నట... పొనీ అలాగే కానీ! ఆడదానిసొమ్ము తింటవా అని నన్నీసడించింది.తన మగనిసొత్తు ఒళ్ళో