పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
12

[అం 1

త గి న శా స్తి

  ఇందు--నే నాలాగు చేస్తే నాసంపద ననుబవించే వాళ్లెవరే? నాకు సుఖ మెలాగు వస్తుందే!
  సరో--సొమ్ము తినేవాళ్లు లేరనా విచారిస్తున్నావు? నీకుబదులు నేననుభవించలేనా? మావాళ్ళందరూ చిన్నప్పుడే గతించారు. ఇప్పుడు పడుచునైనాను పెళ్ళి చేసుకొందామంటే పైసా లేదు. విధంతప్పినదానికి విత్తముంటే ఇదే బాధ అక్కరలేకపోయినా నీకు అమితమైన ధనముంది. కావలసినా నాకు కాసులేదు. ఇంతవైపరీత్య మెక్కడైనా ఉన్నదా
  ఇందు--నీవు పెళ్ళి చేసుకుంటావా?
  సరో-- చేసుకోక చెడుతిరుగుడులు తిరుగు మన్నావా?...అది నాచేత కాదు...తగినవాడు దొరకవలెనంటే ధన ముండితీరవలెను కదా ఈ దినములలో
  ఇందు--తగినవాడిని కూర్చుకో, ధనము నేనిస్తాను. ఎవడిమీదైనా కన్ను వేసినావా?
  సరో--ఒకడిని చూచినాను కాని...అయ్యో!
  ఇందు--ఎవడినో చెప్పుచెప్పు.
  సరో--చె ప్పేమి లాభము అందరాని పండు!
  ఇందు--అయ్యో పాపము! ఊరుకో ఊరుకో!
                 (వీరేశ్వరుడు వచ్చును)
  వీరే--వదినా! నాకు పెళ్ళి చేసుకోవాలని ఉంది
  ఇందు--పెళ్ళాడుతావా? ఎవర్తెని?