పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 2]

11

త గి న శా స్తి

  సరో--ఇం తాలోచ నుందా నీకు?
  ఇందు--శీతాకాలములో ఆకురాల్చిన చెట్టుకాగు, ఎండాకాలములో గరికపోచలెని పొలములాగు, వర్షాకాలములో నీటితోనిండిన మైదానము లాగు అటూ ఇటూ ఏవీ తోచకుండా ఉంది. పరిపరివిధముల పరుగు లెత్తుతూన్నది పాపిష్టి మనస్సు. ఏమి చేయుచున్నావు?
  సరో--నీదశ చాలా విచారగ్రస్తముగా నుంది.
  ఇందు--ఏమి చేయుమంటావు? గాలి కాదు ఎండరటాకులాగు తటతటా, పంజరములో పిట్టలాగు పటపటా కొట్టుకొని8 పై కెగురచూస్తూన్నది. అప్పుడే పుట్టిన ఆవుదూడలాగు పడుతూ లేస్తూంది. నాగతి ముందేమి కాబోతుందో చప్పగలవా?
  సరో--అనుకూలంగానే ఉంటుంది. నీమట్టుకి...పగలూ రాత్రీ పంచదార, మీగడపాలూ, గోధుమపిండి నెయ్యి కడుపునిండా పట్టిస్తే పరిపరివిధముల పరుగు లెత్తదా నీమనసు? ఋషులు తెలివితక్కువవాళ్ళయి వితంతువులను ముతకబియ్యము ముతకపప్పు అరటికాయా పగటిపూటే తినుమన్నా రనుకొన్నావా? తల దువ్వుకోవద్దని, పలచని బట్టలు కట్టుకోవద్దనీ నగలు పెట్టుకోవద్దనీ శాస్త్రాలు మొరపెట్టుతూన్నవి. కావా?.. నేనుచెప్పితే విన్నావుకావు ఫలమనుభవించక తీరుతుందా?