పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
10

[అం.1

త గి న శా స్తి

--; రెండో రంగము :--

---

ఇందుమతీ సరొజనులు.

  ఇందు--మాటాడ నేమే?
  సరో--నానోరు కట్టిపోయినది.
  ఇందు--ఎందుచేత?
  సరో--నీ అవస్ద చూడడముచేత, నీలాటి తలచెడ్డవాళ్ళందరూ దేవుళ్ళ నారాధిస్తూ రామాకృష్ణా అంటూ ఏలాగో కాలము గడుపుకొంటూ ఉంటే  ఇదేమిటి నీ వేషము? దేవబ్రాహ్మణపూజా లెదు; వ్రతాలు, పండుగా పరం నోములూ అనవు. ఇంత విరుద్ధముగా వ్యవహరిస్తూన్నా వేమే?
 ఇందు--ఏం చెయ్యమన్నావు? నామనసుకి ఊరట లేదు. ఆ దేలాగు తల్లడిల్లుతూన్నదో నీకు తెలుసునా?
  సరో--నీవే చెప్పు చూతాము.
  ఇందు--పాడాలనిముచ్చట, శారీరము లేదు; నవ్వాలనుంది, పళ్ళులేవు; జుట్టుదువ్వ సిగ ముడుచుకోవలెనని ఉన్నది, కొప్పు లేదు; ఆగర్బశ్రీమంతురాలలా గుండాలని ఉంది, అరచేత గుడ్దిగవ్వ లేదు. ఇటువంటివాళ్ళ మన స్సెలా గుంటుందో నామనస్సలా గుంది... ఉన్నమాట చెప్పు తూన్నాను. ఏఅయ్యనో కట్టుకొని కాలము గౌరవముగా గడుపుకోవలసి ఉంది; తగినవాడు  దొరకలేదు... ఇప్పుడుబోధపడ్డదా?