Jump to content

పుట:TELUGU-NAVALA.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుగు నవల

39

కూడా కావడంతో, శైలిలో పదచిత్రాలతో ఒక విలక్షణమైక వాతావరణాన్ని సృష్టించగలరు. అంగర వెంకటకృష్ణారావు, ఘండికోట బ్రహ్మాజీరావు నెల్లూరి కేశవస్వామి, మొదలైనవారు విశాఖమండలం రంగభూమిగాను తెలంగాణా ప్రాంతం రంగభూమిగానూ కొన్ని మంచి నవలలు వ్రాశారు. స్వర్గీయ మల్లాది రామకృష్ణశాస్త్రి గారిది కృష్ణాతీరం పేరుతో ఒక నవల వచ్చింది. అనితర సాధ్యమైన శైలీవిన్యాసం. ఇతివృత్త నిర్వహణం ఈ నవలలో కనపడతాయి.

పాతికేళ్ళ క్రితందాకా కొనసాగిన తెలంగాణా ప్యూడల్ వ్యవస్థాస్వరూపాన్ని, దానికి గురిఅయిన ప్రజల దయనీయమైన గాథలను శ్రీ దాశరధి రంగాచార్యులుగారు చిల్లర దేవుళ్ళనే నవలలో వర్ణించాడు. మోదుగ పూలు, మాయజలతారులాంటి ఇతర నవలలు కూడా వీరు రచించారు.

స్వర్గీయ కందుకూరి లింగరాజు 'సమర్పణ' అనే మంచి నవలను రచించారు. “మిగిలేదేమిటి", మొదలైన తదితరనవలల్లో భూడిదమ్ముల(?) మధ్య మానవ జీవితపరమార్థాన్ని జిజ్ఞాసాదృష్టితో వీరి రచనలు పరిశీలించాయి.

మాండలిక భాషలో నవలలు వ్రాయడమన్న ప్రయోగాన్ని చేపట్టి విజయవంతంగా నిర్వహించిన ప్రత్యేకత శ్రీ పోరంకి దక్షిణామూర్తికి లభించింది. ఈయన గోదావరి మాండలికంలో వెలుగు, వెన్నెల-గోదారి, తెలంగాణా మాండలికంలో ముత్యాలపందిరీ, రాయలసీమ మాండలికంలో రంగవల్లి నవలలు వ్రాసి తెలుగునవలా సాహిత్యంలో వొక ప్రత్యేకశాఖను ప్రారంభించారు.

బహుళ ప్రచారం పొందకపోయినా గొప్ప నవలలు వ్రాసిన వారు శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావుగారు. వీరి ధర్మనిర్ణయం చాలాగొప్ప నవల తెలుగులో ఉత్తమోత్తమమైన పది నవలలు లెక్కించి చెప్పవలసివస్తే తప్పకుండా చేరవలసిన నవల. తిక్కన సోమయాజి, అన్నమాచార్యలు, అనే, చారిత్రక నవలలు కూడా శ్రీ రామలింగేశ్వరరావు గారు రచించారు. ఉత్తమమైన భారతీయ సంస్కృతిని. ఆర్ష ధర్మాన్ని, శ్రీరామలింగేశ్వరరావుకు తమ నవలలో ప్రతిపాదిస్తారు. ఆయన గొప్ప పండితుడు వ్యుత్పన్నుడు, మంత్రశాస్త్రవేత్త. ధర్మనిర్ణయం నవలలో ముస్లిం విద్యాధికురాలు, నారాయణరావనే హిందూ యువకుణ్ణి ప్రేమించడం, వారి ప్రేమపర్యవసానం, ఆనుషంగికంగా నారాయణరావు కుటుంబంలోని ఆధ్యాత్మిక సంస్కారం, రెండు మూడు తరాల క్రితం మన