పుట:TELUGU-NAVALA.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

తెలుగు నవల

అవసరాల రామకృష్ణరావు "సంపెంగలు-సన్న జాజులు", "కనకాంబరాలు" మొదలైన నవలల్లో ఆధునిక సమాజస్వరూపాన్ని, ఆవిష్కరించారు. సామాజిక సమస్యల అవగాహన, చిత్రణ, చురుకైన శైలి, ఆహ్లాదకరమైన వ్యంగ్యం, రామకృష్ణరావు రచనలకు వైలక్షణ్యం చేకూరుస్తాయి. పురాణం సుబ్రహ్మణ్యశర్మ ప్రతిభావంతుడైనరచయిత. “చంద్రుడికో నూలుపోగు” అనే మంచి నవలను వ్రాశారు.

ఇటీవల వడ్డెర చండీదాసు అనే ఆయన హిమజ్వాల అనే పేరుతో ప్రయోగాత్మకమైన నవల నొక దానిని ప్రకటించారు. చాలామంది పాఠకుల నాకర్షించింది ఈ నవల.

ఎన్. ఆర్. నంది నైమిశారణ్యం పేరుతో హరిజనులను అగ్రకులాల వారు నేటికీ ఏవిధంగా వంచిస్తున్నారో, హింసిస్తున్నారో వర్ణించారు. మధ్యతరగతి కుటుంబాలలో ఆర్థిక సమస్యలు, స్త్రీలు ఉద్యోగాలు చేయడంలో అభ్యుదయ భావాలు బాగా ప్రచారమవుతున్న ఈ కాలంలో కూడా వాళ్ళు, ఎదుర్కోవలసిన కష్టాలు ఈ నవలలో ఆయన వర్ణించారు.

పోలాప్రగడ సత్యనారాయణమూర్తి ప్రతిభావంతుడైన రచయిత.

ఈయన కౌసల్య, సంఘంచేసిన మనిషి, దీపశిఖ, నవోదయం, భోగి మంటలు మొదలైన నవలలు, ఆధునిక సమాజంలో మానవత్వపు విలువలను ప్రస్తావించే నవలలు, చురుకైన హాస్యం, సులలితమైన భాష, సున్నితమైన వ్యంగ్యం, ఈయన రచనల విలక్షణతలు.

మంజుశ్రీ మానవతావాది. ఆర్ద్రమైన, సుకుమారమైన భావన చేయగలవాడు ఈయన వ్రాసిన “జారుడు మెట్లు", "నూరు శరత్తులు" మానవుల మమతలను పెంచేటందుకు దోహదం చేసే నవలలు.

వినుకొండ నాగరాజు రచించిన ఊబిలోదున్న ప్రయోగాత్మక నవల. నేటి ప్రజాస్వామ్య వ్యవస్థ పైన ఈ నవల మంచి కశామాతం. ఈయన శైలిలో భావ వ్యక్తీకరణలో పదునుచూపగల రచయిత. యువరచయితలలో విలక్షణమైన శైలి. ఇతివృత్తవైవిధ్యం, గొప్పశిల్పం చూపగల రచయిత శ్రీ శీలా వీర్రాజు ఈయన వ్రాసిన నవల "మైనా" చాలా గొప్ప నవల. ఒక పోలీసు కానిస్టేబుల్ స్వీయ జీవితాత్మకంగా ఈ నవల సాగుతుంది. ఈయన చిత్రకారుడు