పుట:TELUGU-NAVALA.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుగు నవల

9

కొన్నారు. సూక్ష్మంగా పరిశీలించి చూస్తే రామచంద్రవిజయానికీ, రాజ శేఖర చరిత్రకూ చాలా పోలికలే కనిపిస్తాయి. అనుకరణంతో ప్రారంభించినా, తరవాత తరవాత చిలకమర్తి నవలారచనలో స్వోపజ్ఞతను విశేషంగా ప్రదర్శించాడు.

1897 వ సంవత్సరం నవలాసాహిత్య చరిత్రలో చాలా ప్రాధాన్యం కలది. ఈ సంవత్సరంలో కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి గారి 'వివేకచంద్రికా విమర్శనం' అనే విమర్శగ్రంథం వెలువడింది. వీరేశలింగం రాజ శేఖరచరిత్రను విమర్శిస్తూ వెలువడిన గ్రంథం ఇది. ఇంతకు పూర్వమే 'రాజయోగి' అనే మాసపత్రికలో ఇది భాగభాగాలుగా వెలువడ్డా 1887 లో పుస్తకరూపంలో వచ్చింది. వీరేశ లింగం రాజశేఖర చరిత్రలో చాలా అనౌచిత్యాలున్న వంటూ, ఆలివర్ గోల్డ్ స్మిత్ మూలగ్రంథంతో దీన్ని పోలుస్తూ,దాన్ని అనుకరించబోయి పాడుచేశాడని, చాలా చోట్ల రసాభాసంపాలైనాయి వీరేశలింగంచేసిన వర్ణనలూ, పాత్ర చిత్రణలూ అనీ తీవ్రంగా బ్రహ్మయ్యశాస్త్రి విమర్శించారు, పుస్తక రూపంగా ప్రకటించినప్పుడు దీనికి పీఠిక వ్రాస్తూ ఈ ప్రక్రియను ఇంగ్లీషులో మాదిరిగానే 'నవల' అని పిలవటమే బాగనీ, తానికముందునుంచీ యీ ప్రక్రియను నవలగానే వ్యవహరిస్తాననీ, ఆ పీఠిక లో ఆయన పేర్కొన్నాడు. అప్పటి నుంచీ వచన ప్రబంధమన్న పేరుకు బదులు 'నవల' అనే పేరు బాగా ప్రచారం లోకి వచ్చి పదిపది హేనేళ్ళు గడిచేసరికి ఈ ప్రక్రియకు నవల అన్న పేరే రూఢమైపోయింది.

చింతామణి పోటీల తర్వాత మళ్ళీ పోటీలు జరిపిన విజ్ఞానచంద్రికా మండలి వాళ్ళు, నవలాపోటీలుగానే యీ పోటీలను - పేర్కొన్నారు. కాబట్టి '1873 వ సంవత్సరం నుంచి 1897 దాకా అంటే పాతిక సంవత్సరాలు నవలను వచన ప్రబంధంగా వ్యవహరించేవారనీ, అటు తరవాత నవల అన్న పేరు ప్రచారంలోకి వచ్చిందని తెలుస్తున్న ది. 1872 నుంచి ఇంచుమించుగా 1900 సంవత్సరందాకా తెలుగు నవలాసాహిత్య చరిత్రలో మొదటి ఘట్టం. చారిత్రక నవలలు, సాంఘిక నవలలు, ప్రధానంగా వెలువడ్డాయి. 1900 సంవత్సరం నుంచీ రెండో ఘట్టం ప్రారంభమైంది. చిలకమర్తి పౌరాణికేతివృత్తాలను గ్రహించి నవలలుగా వ్రాయటం ప్రారంభించాడు. 1905, 1906 వ సంవత్స రాలలో వంగదేశ విభజనోద్యమం తెలుగుదేశాన్ని బాగా ప్రభావితం చేసింది. స్వాతంత్ర్యోద్యమం కూడా బలపడసాగింది. వంగదేశపు సాహిత్యం, చరిత్ర,