6
తెలుగు నవల
సంవత్సరం పోటీకి చిలకమర్తి మళ్ళీ నవల పంపించాడు ఆ నవల హేమలత. దానికి ప్రథమ బహుమానం వచ్చింది. మళ్ళీ రెంతోబహుమానం ఈసారి కూడా ఖండవల్లి రామచంద్రుడే గెల్చుకొన్నాడు. ఆయన నవల లక్ష్మీ సుందరవిజయం. 1887 లో మళ్ళీ చిలకమర్తి నవల అహల్యాబాయికి ప్రథమ బహుమానం వచ్చింది. ఈ సంవత్సరం రెండో బహుమానం లేదు. 1898 లో మళ్ళీ చిలకమర్తి కర్పూర మంజరికి ప్రథమ బహుమానం వచ్చింది. కూనపులి లక్ష్మీనరసయ్యగారి భక్షీ అనే నవలకు ద్వితీయ బహుమానం వచ్చింది. అటు తరవాత చింతామణి పత్రిక ఆగిపోయింది. వీరేశలింగంగారు సెలవు పెట్టి మద్రాసులో ఉన్నారు. ఈ విధంగా ఆరుసంవత్సరాలు చింతామణి మాసపత్రిక నవలా పోటీలు నిర్వహించి ఆధునిక సాహిత్యానికి మహోపకారం చేసింది. ఈ పోటీలు లేకపోతే చిలకమర్తి వంటి గొప్ప నవలారచయితలు నవలలు వ్రాసే వారే కాదేమో. చింతామణి మాసపత్రిక నవలా పోటీలలో గెలుపొందిన ప్రథమ ద్వితీయ బహుమాన నవలలకు, ధనరూపకమైన బహుమానాలివ్వడమే కాక, ఆ నవలలను పుస్తకరూపాన ప్రచురించి కొన్ని ప్రతులు రచయితలకు బహూకరించేది. ఆ రోజుల్లో నవలా రచయితల కది గొప్ప ప్రేరకమయింది.
1893 వ సంవత్సరంలో తొలిసారిగా నవలా పోటీలను నిర్వహించి సప్పుకు, రచయితలకు మార్గదర్శకంగా ఉండేందుకు ఈ పత్రిక కొన్ని నియమ నిబంధనలను ప్రకటించింది. ఈ నవలా పోటీలు నిర్వహించినప్పుడు కూడా చింతామణి నవలను వచన ప్రబంధంగానే వ్యవహరించింది. వచన ప్రబంధం ఎట్లా వ్రాయా, దాని లక్షణాలేమిటి ? కథ ఎట్లా ఉండాలి. కథనం ఏవిధంగా ఉండాలి మొదలైన విషయాలు సవివరంగా ప్రకటించింది. పోటీలో పాల్గొనదలచిన వాళ్లు, కందుకూరి వీరేశలింగంగారి రాజశేఖర చరిత్రం, సత్యవతీ చరితం మొక్కన వచన ప్రబంధాలు చదివి, లక్షణాలు గ్రహించవచ్చుననీ ప్రకటించింది. ఏకసూత్రత ఉండాలనీ, అనువాదం కారాదనీ, అక్కడక్కడ సంభాషణరూపంగా కథసాగితే బాగా ఉంటుందనీ, చింతామణి పత్రిక సూచించింది. అందుకే కాబోలు చిలకమర్తి "నవలలు వ్రాయుటకు మాకప్పుడు వీరేశలింగముగారు వ్రాసిన రాజశేఖర చరిత్ర మను నవలయే యాదర్శకము. ఆ నవలను నే నామూలాగ్రముగా చదివి నవలలు రచియించు పద్ధతిని తెలిసి కొని రామచంద్ర విజయమును వ్రాసితిని" అని స్వీయ చరిత్రలో వ్రాసు-