పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

142

తాలాంకనందినీపరిణయము


మిన్నతికొంత గాసిలఁగ మిక్కిలి యింత గొఱంతఁ బూనుటే
యెన్నని సంతకాంతలిక యెంతవిసంతల నెంతురో సఖీ.

281


చ.

పెనిచినచిల్కలం దఱిమిపెట్టెద వేమి? యనుంగు చేఁడెలన్
వెనుకకు నెట్టెదేమి? నిను వేమరు లొందు మరాళశారికా
గణముల దిట్టె దేమి? కసుగందని నీనెఱసోయగంబు క్రొ
న్ననవిలుకాని కాఁకల నణంగి కరంగదొఱంగె దక్కటా!

282


సీ.

ఇంపుగా నమృతంపు నింపఁగా తానముల్
        బెంపఁగా వీణ వాయింప వేమి?
కన్దమ్ములకుఁ జూడ నందమ్ముగా మంచి
        గందమ్ము మేన నలంద వేమి?
దిట్టంబుగా తలకట్టుచుట్టున కలి
        గొట్టుపూవులదండఁ జుట్ట వేమి?
నిద్దంపుక్రొమ్మించుటద్దంబు చేబూని
        ముద్దుమోమున బొట్టు దిద్ద వేమి?


గీ.

కలికి! కపురంపుఁ బలుకులు జిలుకుపలుకు
లొలుక చిలుకలపిలుకల కలరవముల
నింపుమీరంగఁ దెలియ బోధింప వేమి?
మహిని గలదటె నీవంటి మచ్చెకంటి?

283


క.

ఇంటంగల బలుపెన్నిధి
వంటి నరాత్మజుఁడు నీకు వరుఁడౌటయె క
న్గొంటి మిక వేరె కోరిక
పంటలకుం గొదువయేమి? బాలేందుముఖీ!

284


చ.

మనమున నీవు వేర నొకమానవనాథకుమారుఁ గోరి యి
ప్పెనువగలం గృశించి మతి భీతి వహించెదొ గాక పార్థనం!