పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

143


దనుని వియోగమోహపరితాపము నొందెదొ? మున్ను నిన్ను జూ
చినగతిగాదు నీవెడఁగుచిన్నియ లెన్న విచిత్ర మయ్యెడిన్.

285


క.

కన్నియల నెందఱేనిం
గన్నారముగాని సిగ్గు గడకొత్తి మదిన్
మున్నరికేలగొన్న సతిం
గన్నెల నెందైన జూడఁగా లే దబలా!

286


ఉ.

ప్రోడవుగావు జూడఁ బసిపూఁపవు నేటికి పల్లునెత్తి మా
టాడఁగలేవు యీగతి గయాళితనం బొనరింపకమ్మ నీ
వేడుకలెల్ల మేమె నెరవేర్చెద మమ్మ పసిండిబొమ్మ నీ
తోడిది నమ్మవమ్మ మముఁ ద్రోయకుమమ్మ కురంగలోచనా!

287


ఉ.

మత్సుతకుం బ్రియాప్తి నభిమన్యుఁడె భర్త యటంచు రాముఁ డ
త్యుత్సుకతన్ వచింపుటది యొక్కటెగాదు సుభద్ర నీయెడన్
వత్సలతం గుమారున కవశ్యముఁ బెండ్లి యొనర్చు కోరికన్
హృత్సుఖలీల వర్తిలఁగ నింక విబారము లేల మానినీ!

288


మ.

అని ధైర్యోక్తులు నెచ్చెలుల్ బలుకఁగా నంభోజసౌగంధి నె
మ్మన మెంతే దిటమూని యాశఁ గొని వేమారున్ బ్రియాధీనజీ
వనయై యొక్కనిమేష మబ్దముక్రియం భావించుచున్ మీనకే
తనబాణానుభవప్రభీతి మది సంతాపించుచున్నంతలో.

289


క.

ఇవ్విధమున శశిరేఖయు
నవ్వడుపున నృపుఁడు మానసానుభవముల
న్నెవ్వగల బొగిలి రనఁగా
నవ్వలికథఁ దెలుపు మనుచు నధిపుం డడుగన్.

290