పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

141


యవయవంబు లాచ్ఛాదింప, సంచరితనిఖిలగ్రహగణగణంబగు గగనం
బవిసి పయింబడు తెఱంగునం దోప, నిఖిలాంగంబుల బొడము పులక
సస్యాంకురంబులకుం బ్రవహింపం గట్టిన జలప్రవాహంబునం బ్రతి
క్షణజనితస్వేదకణగణగంగాతరంగంబులం దొఱంగనీకం గుదిఱించు
ఘటతరణీప్రతిభం దనఱి పయంటం దొలంగి మెఱుంగు బహిర్గతంబౌ
శాతకుంభకుంభోపమానవిజృంభితకుచకుంభంబు లుత్తంభంబులుఁగా
శూలిఫాలాభీలకీలాజాలభూతీకృతచేతోజాతవియోగజనితాకులతం దల్ల
డిల్లి జాబిల్లిం బట్టి బిట్టుశోకించు రతీకాంత తెఱంగున నొక్కనెలఱాలం
దిద్దిన మెఱుంగుటరుంగునన్ మేను జేర్చి మనస్సంగజాగరకృశత్వాద్య
ఖిలదశలం గలంగుచుండునంత.

277


మ.

తనలో దా నభిమన్యురూపములనే ధ్యానించుచుం జూచి న
ట్లనె మెచ్చుం బొలయల్కఁ జెందు మది వేడ్క న్నవ్వుచుం బల్కరిం
చును దర్కించును లజ్జ జెందును చలించున్ చిత్తము న్నిల్వరిం
చును మేలెంచును దిక్కులెల్లఁ బరికించున్ మిథ్యలం చెంచుచున్.

278


క.

ఏతాదృశగతి చేతో
జాతశరవ్రాతపాతచకితాత్మకయై
శాతోదరి భీతిలఁగ వి
నీతాదరు లగుచుఁ జేరి నెచ్చెలు లెల్లన్.

279


క.

బాలా యీలాగున రవ
మేలా! మేలాయె చిత్త మేలాగో నీ
మైలాగో! నీలోఁ గల
యాలోచన దెలియఁ బలుకవమ్మా! కొమ్మా!

280


ఉ.

ఎన్నఁడులేని వింత యిపు డేటికి నీవలపంత మున్ను రా
కన్నియ లింతహంతకముగా మది చింత యొకింత బూని మేన్