పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

136

తాలాంకనందినీపరిణయము


మ.

చెమటార్పం గదళీచ్ఛదంబు లదె వీచెం ధాళవృంతాధిక
భ్రమగా నీకు మనోజయం బిదియె భూపాలా! యికన్ రేవతీ
రమణీపుత్రి యనంగ సంగరమునన్ రంజిల్లుచో నీరతి
శ్రమబిందుప్రశమార్థమున్ సురటి వీచంబూను చందంబునన్.

254


చ.

పొగరున కీరదంపతులు పూఁబొదలందున గేరుచున్ సుమా
శుగసమరక్రియాకలన జొక్కుచు సున్నవి జూడు మట్ల నే
తగురతికేళిలో బలసుతం బెనగొందువు యీనికుంజపుం
జగురునికేతనంబులకు చాటుననేయనురీతి దెల్పెడిన్.

255


క.

అని నర్మసఖుఁడు దెల్పఁగ
జననాథతనూభవుండు చయ్యన ఝషకే
తనకోటీఘనధాటీ
వనవాటీదర్శనోత్సవంబున వెడలెన్.

256


గీ.

పార్థతనయునిరాక కవ్వనవధూటి
కీరవారాంచితసజీవతోరణములు
నిలిపి ఫలభారనమ్రసంకలితకదళి
కాతరుస్థితి మ్రొక్కు సంగతిఁ దనర్చె.

257


చ.

అలరిన చైత్రసత్రములయందు యథేచ్ఛ ఫలోపహారముల్
దలపడ మెక్కి సద్ద్విజవితానము శ్రుత్యమృతోక్తిశాఖికా
విలసితకేసరార్ద్రకనవీనశుభాక్షతలెల్ల వ్రాల్చె న
బ్బలరిపుసూనుసూనునకు భావిశుభోదయసూచనార్థమై.

258


చ.

అమలశుకోక్తి రామకథనాంచితగీతములన్ లతావధూ
సముదయముల్ సదాగతిని జక్కనిగెంజికురాకుపళ్లెరం
బమరిచి నిగ్గుమొగ్గలవయారపుమ్రుగ్గులు తీర్చి శోభనం
బమరఁగ బూవుటారతులు నత్తఱి నీడె నృపాలసూతికిన్.

259


మ.

అల చంద్రాశ్మనిబద్ధశుద్ధతరుమూలావాలముల్ సౌరభా
కలితోద్యత్సుమనోరజంబులును మాకందాదిమాధుర్యస