పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

137


త్ఫలజాలంబులు పల్లవారుణలసత్పట్టాంబరంబుల్ ధరా
తలనాథాగ్రణి కవ్వసంతుఁ డులుపాల్ దాసప్పనం బిచ్చు మం
జులరౌప్యాంచితపాత్రలో యన రుచిం జూపట్టె వన్యావనిన్.

260


చ.

ధరణిపురాక చూడఁగ లతాతరుణు ల్కలకంఠనాదవి
స్ఫురగతి నొండొరుల్ బిలుచుచుం జిగురాకుముసుంగు లొప్ప బం
ధురనవగంధిలప్రసవధూళి విదిర్చి నికుంజజాలకాం
తరములనుండి గుచ్ఛలపనప్రభలం బొడసూపె నత్తఱిన్.

261


క.

ఈలీల నలరు వనిలో
కేళీలోలత జనించుక్రియ నర్మసఖుం
గేలూతగొని చరింపఁగ
నాలో శశిరేఖ తత్ప్రియాయత్తమతిన్.

262


ఉ.

అంతిపురంబునందున హలాయుధు నాజ్ఞ వహించి నిల్చి భూ
కాంతుతనూజు రమ్యతనుకాంతులు భావమునం దలంచి వి
భ్రాంతి వహించి భావభవుపల్లవభల్లవికంపితాగతిం
జింతిలి యంతకంతకు నజేయవియోగపయోధిమగ్నయై.

263


మ.

పగడా ల్దిద్దిన కోళ్లదోమతెఱ జాళ్వాపట్టెమంచంబుపై
జిగిజల్తారుమెఱుంగుచాందినిసిరుల్ జిల్కుం బుటీదారుమేల్
తగటుంజిల్కు టొరుంగు తక్కియల నిద్దాపాన్పునం దర్చకా
శుగపాతాహతచేతయై బొరలు లేచున్ వంతలం జింతిలన్.

264


ఉ.

అమ్మకచెల్ల పిన్నతనమందున నే నభిమన్యుతోడుతం
బొమ్మలపెండిలాటలను బ్రొద్దులు బుచ్చి తదేకభోగమో
హమ్ము లొకుమ్మ డుమ్మడిలునంతటిలోపల నిట్టి రాణివా
సమ్ము విసమ్ముకోర్కె విరసంబునకై ఘటియించె నక్కటా!

265


సీ.

నను పొత్తులో నుంచుకొని భుజించుట యేనె
        చెంతలేకున్న భుజింపలేదు