పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

135


భృంగనినదసుగానంబు చెంగలింప
మ్రోలనాఁడె వసంతుఁ డామోద మొదవ.

249


సీ.

లలనాముఖమురీతి లతికాభిరామంబు
        వేశ్యమాడ్కిని బహువిటపయుతము
నభ్రంబుగతి రాజహంసప్రకాశంబు
        భాగవతము శుకప్రకటస్ఫూర్తి
క్రీడాగృహము నారికేళికానుసరంబు
        రవిలీల ఛాయానురాగభూమి
విద్వజ్జనునిభాతి వివిధాగమహితంబు
        ప్రావృట్ప్రతిభ కందభాసురంబు


గీ.

ధాతకైవడి వరశారదాప్రకాశి
కలితకైలాసగతి నీలకంఠయుతము
సవనవాటికవలె ద్విజోత్సాహమయ్యె
తావకప్రీతి గనుము నుద్యానవనము.

250


గీ.

స్వామి యిదె జూడు పుష్పగుచ్ఛములపైన
గండుమగతేఁటిగమి వ్రాలుచుండు టిదియె
భావిదేవర లిటు బలభద్రతనయ
కుచగుళుచ్ఛంబులను వ్రాలు గుఱిని జూపె.

251


క.

అల్లదె కనుమి రసాలసు
పల్లవముల గంట్లుజేసెఁ బరభృతములు నీ
వెల్లపుడు బలసుతాధర
పల్లవముల గంటొనర్చు పగిదిం జూపెన్.

252


క.

అదె పున్నాగము పెనగొ
న్నది యొకలతకూన చనువునను శశిరేఖా
సుదఁతి లతకూన గావున
బొదవదె పున్నాగ సత్ప్రభుఁడ వీ వగుటన్.

253