పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

131


తొలుకాఱు మెఱయుఁ దళ్కులమెఱుం గని జూడ
        నచట నిశ్చలరీతియైన గలదె!


గీ.

యనుచు వివరింప బాల్బోక నతనుమోహ
వార్ధిని మునింగియున్న నావనట దీర్ప
ఘనకృపాదృష్టి దైవయోగమున జేసి
యరుఁగుదెంచితి నాజీవమై వయస్య!

231


క.

పాలిండ్లను కఠినత్వం
బాలోకనములను చలత నజుఁ డొనఱిచె నీ
లీలనె సతి మదిఁ గలిగిన
నేలాగు జయింపవచ్చు నిక చెలికాడా!

232


సీ.

చెలిముఖం బబ్జారికళలనెల్ల హరించె
        నెఱులు చీఁకటిగుంపు నెత్తి ద్రొక్కె
లలసకన్నులు తేఁటులను చెవుల్ బట్టీడ్చె
        గళము శంఖమును ఫూత్కరణఁ జేసెఁ
గమలాక్షిచనులు కోకంబుల నెదద్రొక్కె
        నారు భోగిని బొరదూర నడఁచె
నలినాక్షి కటి పులినములు వెన్కకు నెట్టె
        నంఘ్రు లంబుజముల నడుసుద్రొక్కె


గీ.

తనువుచాయలు పసిఁడి తప్తం బొనర్చెఁ
బొలతి కిటువంటి యవయవస్ఫురణ గలిగి
తుంటవిల్బారినడలు నావంటివాని
కెట్టు లొనగూడు చెలికాడ యిట్టి ప్రోడ.

233


సీ.

నాతిముఖాలోకనముననే ఫలియించు
        ప్రస్తుతవిధి సముపాస్తిఫలము
నతివ ధమ్మిల్లగ్రహణముననే బొందు
        నీలకంఠసమర్చనీయఫలము