పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

132

తాలాంకనందినీపరిణయము


రమణిలోచనచుంబనముననే సిద్ధించు
        కమలాక్షుపూజానుకరణఫలము
పడఁతిసుధాధరపానంబుననే దీరు
        నరుణబింబాలోకనార్థఫలము


గీ.

మంచి దీభామపొందు లభించెనేని
కంతుమంత్రాధిదైవంబు గన్నఫలము
కోర్కె లొనగూడి యత్తన్వి గూడ నోడి
వేర నొకమూల తపము గావించనేల.

234


సీ.

అతివనెమ్మోము ముద్దాడగల్గినదాక
        నుందునా పున్నమ యొక్కప్రొద్దు
నాతికెమ్మోవిపానక మానునందాక
        బూనుదునే ఫలదానదీక్ష
పడఁతిపాలిండ్లు చేపట్టెడునందాక
        గావింతునే హేమకలశపూజ
నతివసుశ్రోణి నే నధివసించినదాక
        జనుదునా భూప్రదక్షిణము సేయ


గీ.

నటు లొడంబడకున్న నే నాత్మజాత
శాతశరణాతజాతపాతాతిభీతి
నేగతి భరింతు విరహాబ్ది నెటు తరింతు
నింక నేమని యూహింతునే పరంతు.

235


క.

ఈ రీతిన్ మారశరా
సారవిసారప్రసారచకితాత్మకుఁ డౌ
భూరమణకుమారమణి వి
చారము లుడుపంగ నర్మసఖుఁ డిట్లనియెన్.

236


ఉ.

స్వామి పరాకు! మీమది విచారమున న్వెత జెంద నేల మీ
శ్రీమహనీయమూర్తి గని సిద్ధనరాసురయక్షసాధ్యనా