పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

130

తాలాంకనందినీపరిణయము


సీ.

జలజముల్ తమ్ములై నిలిచె కోరిక లూర
        తరుణీచరణమైత్రిఁ దలఁచియేమొ
పటుచక్రవాకముల్ పక్షులై విలపించె
        చెలిచన్గవలసాటి జెందనేమొ
పరఁగు మంకెనపూవు బంధుజీవం బయ్యె
        బాలికాధరలీల బరఁగనేమొ
కుముదినీనాథుఁ డెక్కువ సత్ప్రియుం డయ్యె
        నింతియానన మాశ్రయించనేమొ


గీ.

నవియు ఘనపంకజాతంబు లగుట రహిత
గుణులు దోషాకరులని చేకొనదు తనదు
మార్దవస్నిగ్ధతాహాసమంజుకళల
నొప్పు చెలియంగకాంతులఁ జెప్పనేల.

228


చ.

గరితకచంబు సాటిగనఁగా ఘన మేదిశ కేఁగునో? ముఖ
స్ఫురణ గనంగనోడి యలపూర్ణసుధాకరుఁ డెందు డాగునో?
యురుతరరోమరాజి రుచిరోన్నతి గైకొనఁగా భుజంగ మే
బొఱియలఁ దూరునో యనుచు బుద్ధిఁ దలంపు జనించు నో సఖా!

229


గీ.

జలజగర్వ మణఁచి సత్కళాభ్యుదయమై
తారకాప్తమైన తరుణిమోము
నిందుబింబ మనఁగ జెందదే గాకున్న
కలువ లనెడి పేరు కనులు గనునె.

230


సీ.

ఘనకళానిధిరేఖఁ గాబోలునని చూడ
        నతనికి నిష్కలంకతయు గలదె!
కంతుమాయావిద్య గాబోలునని చూడ
        దానికి సశరీరతయును గలదె!
కోమలదేవాంగనామణి యని చూడ
        నందు నిమేషదృగాప్తి గలదె!