పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

తాలాంకనందినీపరిణయము


వనితపొక్కిలిసరోవరమె మదీయవీ
        క్షణమీనములె తొల్గకునికి గనుట


గీ.

నింక జెప్పెడిదేమి యయ్యిగురుఁబోఁడి
కులుకుశృంగారరసములు జిలుకుతళుకు
కుందనపుబొమ్మ కలువపూగొనబురెమ్మ
సూనశరునిమ్మపలుకుల తేనెతెమ్మ.

220


ఉ.

ఇంతిబొమల్ జగంబుల జయించఁగ నించువిలేటికంచు. న
క్కంతుఁడు తుంటవి ల్విడిచి ఖండము జేకొని బోఁటిమాటఁగా
వింతగ బల్కుచిల్కకు నవీనసుధారసమందు ముంచి దా
నంతయు మేతగా నిడుక్రియన్ మధురాధర మొప్పె బాలకున్.

221


సీ.

బంగారుగిండ్లపై పటుచాకచక్యంబు
        కుంభీంద్రకుంభసంరంభగరిమ
పటుతరకులశైలభవ్యమహోన్నతి
        జలజకుట్మలముల గలుగు మొనలు
నెఱవేణికాయలు నెగడువట్రువయును
        జక్కవకవనొందు చక్కఁదనము
ప్రాఁగెంపుబంతులఁ బఱిగిన దార్ఢ్యంబు
        మేఁటితాళఁపుచిప్ప జోటిసమత


గీ.

గలిపి విధి సతిచనులుగా నిలిపెగాక
నీమెఱుఁగు లీపృథుత్వంబు లీకఠినత
లీమొనలపొంక మీబటు వీధృఢత్వ
మీమెఱుఁగు లీసమత్వంబు లెందుగలవు.

222


ఉ.

ఏమని దెల్పుదుం గువలయేక్షణ చక్కదనంబు నెన్న వే
మోము లనేతకేయవశమో యనఁగా నితరు ల్గణింపఁగా
నేమగు దత్సతీమణి యహీననవీనవిలాసవిభ్రమ
స్తోమము లాస్థతం గనుల జూచిన గాక నెఱుంగవచ్చునే.

223