పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

129


ఉ.

నామనసేమొ నేఁడు లలనాకుచయుగ్మముఁ జేరి రాదు త
త్స్థేమకఠోరఘట్టనలచే నశియించెనొ! మోహవేదనో
ద్దామదవాగ్ని గ్రాగెనొ? నితంబినిసుందరతాప్రవాహమం
దేమఱి గ్రుంకెనో? ఖలరతీశ్వరతస్కరుఁ డాహరించెనో.

224


మ.

బొమసింగాణిని లోచనాంబకము లింపు న్మీర సంధించి యా
హిమరుగ్బింబము రెండుఖండములుగా హేలాగతిం ద్రుంచి య
య్యమృతద్రావము నింకనీక సతిదివ్యాస్యోరుపార్శ్వంబులం
గొమరొప్పన్ సమకూర్చిన ట్లమరె చెక్కుల్ ధాళధళ్యంబులై.

225


సీ.

జనుల నెమ్మన మాసఁగొనఁగఁ జేయుటఁ జేసి
        యతివబంగరుబొమ్మ యనుట నిజము
నెఱి తళుక్కని మేను మెఱయుచుండుటఁ జేసి
        వనిత తొల్కరిమెఱుఁ పనుట నిజము
గుబ్బచన్నుల పూవుగుత్తు లుండుటఁ జేసి
        యంగన లతకూన యనుట నిజము
కువలయామోదంబు గూర్చియుండుటఁ జేసి
        మినుకువెన్నెలతేఁట యనుట నిజము


గీ.

కులుకు జిలిబిలివలఁపుజిల్కుటలు చేసి
యలరుగేదంగిలేమొగ్గ యనుట నిజము
మతి మరులుబోదు క్షణమైన మరుపురాదు
పంకజాయతనేత్రి తాలాంకపుత్రి.

226


గీ.

హరిఁ గొలిచి కౌను తత్పదం బందె ననుచు
చన్గవ గిరీశుఁ గొలిచి తత్సమతఁ జెంద
హరిహరుల కిర్వురకు ప్రియం బంచునటుల
వనితనూఁగా రహీనవృత్తిని దనర్చె.

227