పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

127


విపులగుణశాలి నిటువలెఁ
దపియింపఁగ జేయు తరుణిఁ దాచక చెపుమా!

215


చ.

అనుట నృపాలసూతి వినయం బెనయం జెలికాఁడ శైశవం
బున శశిరేఖతో చిఱుతపోడిమిలీల మెలంగుటెల్ల నీ
మనమున గోచరించె యిట మానిని యౌవనవేళ రాణివా
సనియతినుండుటల్ హృదయశల్యముగాఁ దగి బాయ దక్కటా!

215


ఉ.

కన్నియ కెన్నఁ డీవయసు గల్గునొ దర్పరిరంభణాదిసౌ
ఖ్యోన్నతు లెవ్విధిం గలుగునొక్కొ! నిరీక్షణ సేయఁగా వయో
త్పన్నముజెంద పాపఁపువిధాతృవశంబున రాణివాస మం
చున్నను బాసె నాకనులఁ జూచుటకైనను నోచకుండఁగన్.

216


క.

వేడుకమాటలు బలుఁ డీ
చేడియకు న్నాకు బెండ్లిజేసెద నని ము
న్నాడిన శపథోక్తుల నల
నాఁడే తనమదిని మరచినాఁడేమొ జుమీ.

217


క.

అతులతరరూపరేఖా
న్వితయగు శశిరేఖ తనువినిర్మలరుచులన్
నుతియింపఁదరమె యాఫణి
పతికి బృహస్పతికి తుదికి భాషాపతికిన్.

218


సీ.

నెలఁతకురుల్ జాతినీలంబులే గావె
        ఘనమన్మనస్తృణగ్రాహు లగుట
నింతినెమ్మోము పూర్ణేందువే మామక
        నేత్రచకోరముల్ నెవలు విడుట
పొలఁతిపయోధరంబులు మందరాద్రియే
        మద్గభీరమనోబ్ధి మధనగొనుట