పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

తాలాంకనందినీపరిణయము


భూరినిశ్చంచలధీరతాగరిమంబు
        నూరక శిథిలమై యుండనయ్యె
నప్రతీకస్ఫూర్తి నలరెడు శౌర్యంబు
        ప్రాకటం బుడిగి చికాకుపరచ


గీ.

వట్టెమ్రాఁకుల చివురాకు బొట్టెకోల
బట్టి పాంథుల నిట్టట్టు నెట్టునట్టి
దిట్టసిరిపట్టిబోలినజెట్టి జగతి
గలుగునే యంచు మదినెంచు కళవళించు.

212


సీ.

కవివర్యు 'లనఘవిక్రమశీల' యని బల్క
        వినుటకు లజ్జమై వెరపు దోఁచు
మాగధు 'లతిధైర్యమణి 'యంచు బొగడంగఁ
        జెవియొగ్గి యాలించ సిగ్గు జెందు
బుధులెల్లను 'వివేకనిధి' యంచు గొనియాడ
        ననుమోదమును బాసి మనసు రోయు
జనవరు 'ల్వరబుద్ధిశాలి' యంచు నుతింపఁ
        బెం పెల్లడిగి తలవంపు లౌను


గీ.

నహహ! వలరాజు బలుదాడి కతఁడు నోడి
తాల్మి బోనాడి ధృతి వీడి తడవులాడి
తనకు రక్షకు లెవరు మున్వెనుక గనక
చింత నంతంత వలవంత జెందు నంత.

213


గీ.

'కామబాధా దహం కిం కరోమి' యనుచు
'అన్యథోపా స్తి నాస్తి క్వ యామి' యనుచు
‘విస్మయావేదనేన హతో౽స్మి' యనుచుఁ
బలువరింపఁగ సాగె నప్పార్థసుతుఁడు.

214


క.

అపు డొకనర్మసఖాగ్రణి
నృపసూతిం జేరి పలికె నీయట్టిమహా